తే. వలచినను కీడె, కీ డగు వలువకున్న
ఎంతగనొ పెంచు నా భార్య ఈ సమస్య
శయ్య మరలి గుహ్యమును హస్తమున మూసి
బయట పెట్టు చిత్రాలలో పడతి పగిది.
తే. బాహ్య సంయోగ బంధమ్ము ప్రాప్తమగుట
నెరిగి భార్యయొ, భర్తయో ఏహ్యపడుచు
వారి పెండ్లిని విడనాడ ఒరగరాదు
మొదటి పొరబాటు కెందైన చెదరరాదు.39
తే. అతడిలో నేమి చూచె నా యౌవనాంగి
వృద్ధుడాతడు, భర్తయు వీరవరుడు
అనుచు నడిగిన చెప్పగా నగునె వీలు
ముసలి ప్రేమించి ఆమెయు మోసపోదు.
తే. చెలిరొ! నీ చేతి, చేతిలో చేర్చుకున్న
పథము నందున్న దీపముల్ ప్రభల వెలిగె
వాయువుల్ మారె మృదు మంద పవనములుగ,
పడయుచుంటి నవధి సమీపమ్మునందు.
తే. ఏను కోరినది అనుగ్రహించినాడు
ఈశు డేగోర నిన్ను నాకిచ్చి నంత
ఎపుడు నాదు హస్తాలు ప్రార్థింపలేదు
ఇందుతో పూజ పూర్తిగావించినాను.
తే. నాదు ప్రియురాలు తాను గాంధర్వి ననిన
ప్రతిన చేయంగ వలెయన - ప్రబలరక్తి
పలుక నొక మాట - నమ్మెద వలపు జూచి
ఏ నబద్ద మటంచు గ్రహించి యైన.
తే. పుట్టు పువ్వుల వెన్నియో గిట్టుచుండు
ముసుగులో నుండు నొకకొన్ని మొగ్గ లటుల
కొమ్మలందునే యుండును కొన్ని పూలు
అబ్బజేయవు సౌఖ్యమ్ము నన్ని పూలు.
152
వావిలాల సోమయాజులు సాహిత్యం-1