'ఉపాలంభము '
ఉ. ఎంతటి భక్తి ఆ స్మర మహీపతిపై మలయానిలుండు ని
శ్చింతగ తృప్తితో కొలువు చేయుచు - ఇచ్చునదేమొ కాని దు
ర్ధాంత వియోగ బాధితుల తప్తుల జేయును శీతలాగ్నిచే
నింతటి బంటు కల్గెనటె ఎవ్వరి కేనియు నేయుగంబునన్?
ఉ. కోపముతోడ మాట ననగూడని మాటల నాడి పోసి ఆ
పాపపువాయు వీదెసకు పైకొని రానటు చేయనేని సం
తాప వియోగ వహ్ని నను దగ్ధము చేయగ భస్మరాశినౌ
నాపయి దుఃఖ వార్నిధుల నల్గడ కోసిన నిష్ఫలంబగున్.
మ. అది గాదే చెలినీవు కేరళ మహా హర్యంబుపై నున్న యా
మదిరోన్మత్త పుళింద నాయకులతో మాటాడి చంపింపవే
కదనుల్ త్రొక్కుచు వాని వాహనములై కాల్డ్రవ్వ ఏ మ
న్మద సందోహము చూతమింక నెటు దుర్మార్గుండు రానేర్చునో?
మ. చెవి నీవేణి కఠోర చందన గిరిశ్రీగంధవాతమ్ము లౌ
బిలమందున్నమా చూచి సత్వరముగా పెంతురు నవ్వాని నా
అలుకన్ దీర్పగ నెంచి ఏ యెడను కారాగార మందుంచెఁగా
తలుపుల్ బట్టు బిగించి రమ్ము ప్రణయార్తల్ నిన్ను ప్రార్థింతురే!
ఉ. ఈయది వెర్రి ఊహలు కదే - అటులేల యొనర్తు రే సఖీ?
ప్రాయపు గబ్బి గుబ్బెతలపై బిగికౌగిలి కల్గు చిత్తడిన్
పాయగ చేయుచున్ శబర పల్లవులన్ స్మరకేళిఁ తేలఁగాఁ
జేయుచు మేలు జేయుచును చెల్వుడుగా మెలగుం గదా సఖీ! 5
మధుప్రప
143