పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/141

ఈ పుట ఆమోదించబడ్డది

'తల్లి '


తే. అందములు చిందు నీ మందిరాంతరాన
    అమ్మ యీ బిడ్డ యెన్నఁడో యాడునపుడు
    విసరి పెనుగాలి ప్రాభాతవేళ నెత్తి
    దిగిచి చనినది యవ్యక్త దేశమందు.

తే. ప్రకృతి యంతయుఁ బరికించి, భ్రమల వీడి
    చిఱుత నగవుల మునుముందుఁ జిలికె - అంత
    నమృతమయ రూప! నీ వెద నవతరింప
    నన్ని దిక్కుల వెదుకుచు నలసిపోయె.

తే. కనుఁగవ కొలంకు లుడుగని కడలు లనుచుఁ
    గారు కన్నీటి సెలయేళ్లఁ గదనుఁ ద్రొక్క
    బావు రని యేడ్వ నీ ముద్దుపట్టి తల్లి
    బావురని యేడ్చెఁ దూరులో పర్వతములె.

తే. దినము లీరీతిఁ గడచెను - తేరు కొనిన
    యంత నినుఁజేరు కోర్కెతో నిఖిల దిశల
    మాయలోకానఁ బడతి నేమా యటంచు
    వెదకి వేసారి వెళ్లినై విసిగి పోయె.

తే. అనుదినమ్మును నెద నిన్నె యాలపించి
    స్వప్న వీధుల నిను జూచి సంతసించి
    తల్లి, దరిఁ జేర్పుమని సదా ధ్యానముద్ర
    ధారణము సేసి కొల్వగాఁ దలఁచినాఁడు.

తే. తల్లి, కేల్మోడ్చి నంతనే తావకీన
    మూర్తి యెదలోన నేటికో మ్రోడువోలె
    పుత్ర వాత్సల్యమును జూపు పొలుపు వీడి
    కానుపించిన దేమౌను కారణమ్ము? 6


మధుప్రప

141