మ. పరిహాసోక్తుల, వ్యంగ్య భాషణములన్, భవ్యానురాగాల సుం
దరసల్లాపములన్ రచింతుఁ గవితల్ - తంత్రీరుచిన్ 'సాజ్ సం
తురులం' బాడెద గీతికల్ - తుడుచుచున్ ధూళిన్ గనుంగొందు దు
స్తరమోహమ్మున నాదుబింబమును నాశాదర్పణం బందునన్.
చ. నిలిపెద నెల్లదిక్కుల “సునిశ్చయదీపిక" - లెల్లవారలున్
వలచి వచింత్రుపో “ఇది దివాళి” యటంచు - మరేల నాకు నా
కులపడ నిట్లు? ఏరి రసికుల్ పలుసంఖ్యగ పాఠకోత్తముల్ ?
తలఁపఁ బరాయిభాష కవితన్ మును శ్రోతలకై వచింతునే?
మ. కవితల్ పాడెద నల్గడల్ ఉదయశంఖధ్వానముంబోలె న
య్యవి గేహమ్ముల మారుమ్రోయ నెటుగా నాలింప రవ్వాని వా
రెవరైనన్ రసికాళి యల్పమని నా కేలా విచారమ్ము - నా
కవితామంజుల వల్లకీమసృణ నిర్వాణమ్ము జృంభించుతన్.
శా. ఏనో యూహల నిట్లు మున్గుతరి తా నేతెంచె నిల్లాలు : "మి
మ్మా విశ్వేశ్వరుఁ డోముగాత! ఎటుగా నాయవ్యయం బీ నెల
న్గావింపన్వలెఁ జూచి చెప్పుఁ - డొకచొక్కా మీకు కావాలి - పై
నా వీపంతయు జినె - రూక లొక మూఁడైనన్ వలెన్ దానికిన్.
చ. కల మిదె చేత నున్న దదె కాగిత మం" చనె: అంత నేనునున్
దలఁచితి మాసపట్టిక కథ న్గన - చాలదుప్ప టయ్యె - నే
నిలువుగ నడ్డ మెంతో తెగ నీల్గుచు లాగితి - కాళ్లు కప్పినన్
దలపయిఁ జాలదయ్యెఁ దలఁదాల్చినఁ గాళ్లకు జాలదయ్యెడిన్.
ఉ. సుందర భావగీతికల శోభిలనున్న మదీయపత్రముల్
చిందరవందరై రణముచేసెను రాబడియున్ వ్యయమ్ము - ఆ
నందము డిల్లవోయెను - ఘనమ్ముగ దైన్యము గ్రమ్మసాగె -ఇం
కెందుకు బుద్ధికి న్నెదకు నెల్లెడ ఘర్షణ యున్నదే కదా! 12
తే. కలుగ బుద్ధికి నెదకు సంఘర్షణమ్ము
కవిని సౌందర్యపూజకాగ్రణిని - మధుర
కావ్యగీతుల వ్రాయఁగా నడఁగి యేను
“లోటు - బడ్జెటు” నొకటి నిర్మించినాఁడ! 13
మధుప్రప
129