ఆ.వె. తనదిగాని ధనము ధర్మమిచ్చుటలోన
బుద్ధి యెంతగానొ పుట్టు - నిదియె
యత్తగారి సొమ్ము నల్లుని దానము
నమ్ము మోయి నాప నారసింగ!
ఆ.వె. తెలివి నమ్మి, మంచి దేవుని సత్యాన్ని
మొరిగి మెలఁగినంత జరిగి పోదు
అబ్బెగాదె హరికి నపుడు మేషాండంబు
నమ్ము దీని నాప, నారసింగ!
ఆ.వె. ఆలి సొమ్ము చేరి యబ్బగా భాగ్యమ్ము
భాగ్యమౌనె యద్ది భంగ పరచు,
గంగ నెత్తికెక్కి వంగఁజేసెను నీశు
నమ్ము మోరి చవట, నారసింగ!
ఆ.వె. చిత్తమంచుఁ జేరి జీవించువా రెల్ల
కడకు నిటుల మూషికాలు గారె!
పూని పౌరుషంబు పొగఁడగా నేర్తురు
నమ్ము మోరి చవట, నారసింగ!!
ఆ.వె. దైవనిందఁ జేయఁ దలపెట్టు 'త్వాష్ట్రుండు'
వేదనిందఁ జేయ వెఱచువాఁడె?
అమ్మ నెక్కువాని కత్తొక లెక్కయా?
నమ్ము మోరి నాప! నారసింగ!!
ఆ.వె. పెద్దలెవరు లేక పెండ్లి గాకుంటేను
షండుఁ డన్నపేరు సంక్రమించు
లంజె నొకతెఁ జేర్పరంకువాఁ డంటారు
నమ్ము దీని చవట! నారసింగ! 12
ఆ.వె. కుక్కతోక వంటి కొక్కెర బుద్దికి
నక్క నడచు పుంత మక్కు వగును
సింహ మేగు త్రోవ చిత్తాని కెక్కునా?
నమ్ము మోయి చవట! నారసింగ! 13
మధుప్రప
127