పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/125

ఈ పుట ఆమోదించబడ్డది


తే. స్నానవేళ రంధ్రాల కంకణములోని
    చిల్లులందలి పసుపును చిత్రగతిని
    వెదురు పుల్లతో, తమి, తీసివేయుచున్న
    నాతి, ఎవని కృతార్ధుని జేతు వీవు? 42

తే. తెరవ సుకుమారి అయ్యును తీక్ష్ణమైన
    నేరెడి ఫల కషాయము చేరినట్టి
    దుమ్ము ఈ అంగరాగ శేషమ్ముతోడ
    వంటి నీరాడె గోదారి వడ్డునందు.

తే. స్త్రీలు మంగళ గీతికల్ తృప్తి పాడి
    వరుని వంశ ప్రశంసచే మరులు గొలుప
    నవ వధువునకు వినుటతో వివశయగుట
    మధుర మంజు మనోజ్ఞ రోమాంచమయ్యె.

తే. “నా వివాహ మంగళ గీతికా విశేష
     నాదములు సమీపించు చున్నవి" యటంచు
     యువకులతో గూడియాడి ఆశించు చుండె
     నదె వెదురుపొద ఎంతయో యనుచుతోచు. 45


మధుప్రప

125