పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/119

ఈ పుట ఆమోదించబడ్డది

'గాథలు '


తే. గాథలల్లోన గేయాల గతుల, వీణ
   పలుకులందున ప్రొడలౌ పడతులందు
   కలుగు నుత్తమ రసమును గానలేక
   అవని బ్రతికెడి వారల కయ్యదియె శిక్ష.

తే. ఊది గాలిని నోటితో నోయి కృష్ణ
    రాధ కన్నుల నలకల బాధ తీర్చి
    గోపికల గౌరవమ్మును గూల్చినల్ల
    దనము స్వచ్ఛత పోగొట్టదగునె నీవు?

తే. "ముద్దుబిడ్డఁ డిప్పుడును దామోదరుడు"
     అనుచు ప్రీతితోడ యశోద అనినయపుడు
     కృష్ణుని ముఖములోన వీక్షించి ఎల్ల
     గోపికలు నవ్వుకున్నారు గూఢముగను.

తే. అచటి గోపికలందలి ఒక్క నిపుణ్
    ప్రక్క గోపిక కడజేరి ప్రౌఢముగను
    రమ్యరీతి నాయమ కపోలమున తోచు
    కృష్ణు ప్రతిబింబమూర్తి చుంబించి చనియె.

తే. కాననముల జనించు దావానలంపు
    పొగను నల్లబడిన వింధ్య నగము శ్వేత
    జలదముల క్షీర సాగర చారు మధుర
    మహిత దుర్ధారుడౌ మధుమదను బోలె.

తే. అప్రియాధర మధుర సమాస్వతి రుచు?
    భాగ్య మబ్బక పోవుట వలన నేమొ?
    తెచ్చుకొన్నారు దేవతల్ తృప్తివడగ
    రమ్య మమృతమ్ము రత్నాకరమ్ము నుండి. 6


మధుప్రప

119