పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/25

ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రసన్న త్వము దొఁప భక్తానుగ్రహకాతరుఁ డయి యిట్లనియె. ॥నారాయణుఁడు॥ ఓసురేశ్వరీ నీ చెప్పి నవచనమును నా చెప్పిన వచనమునుభం శమునొందక సమమైయుండునట్లుగ నాచరించెదను. ఆక్రమము వినుము. భారతీ దేవి తనకలచే సరిద్రూపము: దాల్చి భారతమునకుఁ జనునది. ఆవాణి తనయద్ధాంశము చేత బ్రహ్మ సదనమునకుం జనునది. ఆ సరస్వతి స్వయము నాగృహమున నుండఁ జను. ఆగంగ త్రిభువనములను పవి త్రములు సేయుటకు భగీరథుని చేఁ గొంపోవఁబడి భారతమునకుఁ జనం గలదు. ఆగంగ స్వయము నాయింట నుండఁజను. అయ్యెడన యాగంగ దుర్లభ మయినచంద్రమౌళిశిరముం బొంది యామె స్వభావమునఁ బూత యయ్యు నంత నతిపవిత్రురా లగును. ఓకనులాలయా నీపు నీకలాం శాంశముల చేత భారతమునకుఁ జనీ పద్దావతి యనుసరి ద్రూపముసు, తులసి యను వృక్ష స్వరూపమును దాల్పుము. సరిద్రూపములు దాల్చిన మీకుఁ గలియందు సైదు వేల యేండ్లకు విమోక్షణమును మరల మద్గృహప్రాప్తి యుఁ గలుగును. సర్వశ రీర ధారులకును విపత్తి సంపద లకు హేతుభూత మై యుండు. ఓపడ్డా సంసారమునందు విపత్తి వినాగా నెవ్వరికి మహిమము గల్గు? నామంత్రము నుపాసించు సాధు వులు స్నానము సేయుట క వగాహన మొనర్చుటం జేసి మీకుం బాపిష్టుల సంస్పర్శమువలన నైన పాపములు దొలఁగు. ఓసుందరీ పృధివి యందుం గలయ సంఖ్యాతము లగుతీర్థములు మద్భక్తజనులదర్శనస్ప ర్శనములవలనఁ బూతము లగును. ఓసతీతిలకమ ' మదీయమంత్రము ను పాసించుభ క్తులు భారతమును స్రవిత్రము సేయ నందు సంచరించు చుండుదురు. వారు మహాపవిత్రులు. అతిమనోహరులు,నాభ క్తులెచ్చో టనుండుడి)రో? వార లెచ్చోటం బాదములు గడుగుకొనుదురో? ఆచోటు సుపవిత్ర మగుమహాతీర్థ మయి వెలయు,నిజము. స్త్రీని జంపిన వాఁడైనను గోఘ్నుఁడైనను కృతఘ్నుడై నను బ్రహహత్య యొన రించినవాఁడైనను - గురుతల్పగుండై నను నాభక్తుల స్పృశించుట