పుట:Tirupati Venkata Kavula Natakamulu.pdf/203

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓం

శ్రీమత్పరదేవతాయైనమ:

పాండవ విజయము

ప్రధమాంకము
(నాంది)

చ. కరము మనోహరంబు లతికర్ణము లాశ్రితవత్సలంబులుం
    బరపురభేదకంబులు సుమాసదపాంగనివాసభూము లు
    ద్ధురకృపభావుకంబులు విధూతపితామహ మస్తకంబులౌ
    హరిహర నాధులోచనము లైదిటికి న్విజయంబు గావుతన్
                (నాంద్యంతమున సూత్రధారుఁడు ప్రవేశించును)

సూత్ర- ఆర్యురాలా! నీయొడలి సింగారము ముగించుకొని త్వరగారమ్ము.

(నటి ప్రవేశించును)

నటి- ఆర్యపుత్ర! ఇదిగో వచ్చితిని. ఏమి సెలవు?

సూత్ర- ఏమి యింత తడసితివి? రసాస్వాదనత్వరాయమాణ మానసులగు సభాసదు లింతటి కాలహరణమున కోర్తురా?

నటి- ఈనాఁడు తలదువ్వుకొనుటకుఁ గొంచెమాలస్యమయినది కావున క్షమింపవలయును.

సూత్ర- సహజశ్రీగల యీకురుల సంతతికి శృంగారము గూడనేల?

నటి-సహజశ్రీగలవానికయినను సంస్కారమువలన మిగుల శోభవచ్చునుగదా?

సూత్ర- (ఆలోచించి) ఔను. ఐనను స్త్రీలకు సహజసౌందర్యమే సౌందర్యము. అందును సకృత్రిమాలంకరణములలోఁ గురులసంతతియే ప్రథమగణ్యంబు.

గీ. కృస్ణవిమతంబు ద్రోణగాంగేయభూషి
    తంబు ద్విష్టశిఖండిమద్రబహుళంబు