పుట:Tirupati Venkata Kavula Natakamulu.pdf/18

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరా- (సంతోషముతో దనలో) ఔరా! తీర్థయాత్రామహాత్మ్యము!

ఉ. ఎందఱు పెద్ద లెందఱు మునీశ్వరు లెందఱు పండితుల్ మహా

   నంద మొసంగ జాలెడి రనంబులు నేఱులు గొండ లెన్ని వే
   డ్కం దులదూగు పల్లెలును గ్రాసుములున్ బురముల్ మఱెన్ని యీ
   చందము లన్నియున్ స్వాంతమ శాంతము గాకయుండునే?

(సంతోషావేశముతో) నా జన్మ మెంత ధన్యమైనది?

శా. కాశీయాత్ర యొనర్చితిన్ మఱి ప్రయాగ క్షేత్రమున్ జూచితిన్

    శ్రీశైలేశు భజించితిన్ గొలిచితిన్ శేషాచలావాసు రా
    మేశున్ మ్రొక్కితి సన్నుతించితిని నీలేలాధరాధ్యక్షు రం
    గేశున్ గాంచితి మెట్టినాడ నిక నెన్నే దివ్యదేశంబులన్.

(పరిక్రమించి) ఎదుట నేదో యొకనది పొడకట్టుచున్నయది.

(కొంతనడచి)

ఉ. నేరెడుపండుచాయ నవనీరదమండలిభాతి నీలపుం

   బేరువిధాన దుమ్మెదలపెండుగతిన్ గగనంబుపోల్కె నీ
   నీరము పెన్నిగన్నిగల నిండుచు నున్నది యింతనల్లనౌ
   నారము దేని కొప్పు? యమునానదియే యిది యెల్లభంగులన్.

ఓహో దీని రామణీయకము!

తే.గీ. నలుపయిన నేమి మిగుల నానంద మొసగు

     సొబగు గల్గిన దీ నదీసుందరాంగి
     ఇట్టి సొగసరి భార్యగా నేలుచున్న
     గేస్తు రత్నాకరుడు కృత్యకృత్యముడు

(ఆకసమువంక జూచి) అరుణగభస్తిబింబము చాలవఱకు బడమర దిరుగుచున్నది. కావున నేనింతలో నీ నదిం దాటి యసలి యొడ్డున నేదేని యొక పవిత్ర ప్రదేశమున నీరేయి గడపి రే విందు గ్రుంకులిడి విధివిహిత కృత్యము లాచరించుకొని మఱియుందోయెద. (దెసలు పరికించి) కర్ణధారుండు కాబోలును పుట్టెనుండి దిగి యిట వచ్చుచున్నాడు. నన్నుం గూడ నవలి యొడ్డు చేర్చిన పిదప బొమ్మనియెద.

(అంత దాశుడు ప్రవేశించును.)

దాశు- (తనలో) మరల నెవరో యొక జడదారి గాబోలును వచ్చుచున్నాడు. నేడేమోకాని యెంతసేపటికిని నాకు గూటికే తీఱినది