ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ యధ్యాయము

ఆంధ్రమహాభారతరచనము.

తిక్కనసోమయాజి దశకుమారచరిత్రము నంకితము నొందిన పిమ్మటఁ గొంతకాలముసకు మనుమసిద్ధిరాజునకు శత్రువులనుండి కష్టములు గలుగుచుండుటఁ గన్నులారఁ గాంచుట తటస్థ మగుచు వచ్చెను. రాజ్యసంరక్షణము దుర్భర మై గన్పట్టెను. మనుమసిద్ధిరాజు దాయాదివర్గమునుండి కలిగెడు బాధలను దప్పించుకొనుటకై కాకతీయ సైన్యాధిపతులకు వశ్యుఁడై మెలగవలసి వచ్చెను. తిక్కన సామాద్యుపాయ తంత్రముచే నెన్నితడవలు మనుమసిద్ధిరాజును గాపాడి రాజ్యము నిలువఁ బెట్టగలిగినను దుదకు దై వసంఘటనము, వేఱుగ నుండెను. కడపట గొల్లరాజులతోఁ బసులమేపుబీళ్ల కై తగవులు పడి యుద్ధములో మనుమసిద్ధియును, తనపెదతండ్రికుమారుఁడు ఖడ్గతిక్కనయు మరణము నొందుటను గాంచెను. వృద్ధుఁడైన పెదతండ్రి సిద్ధనామాత్యుడు గూఁఢ స్వర్గస్థుఁ డయ్యెను. మనుమసిద్ధి రాజ్యమును గాకతీయసైన్యాధిపతు లాక్రమించుకొని పరిపాలింప సాగిరి. దేశస్థితి యంతయును మాఱిపోయెను. జనులలో శైవవైష్ణవమతభేదములు ముదిరి పక్షము లేర్పడి