ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ యధ్యాయము

73


నప్పు డయ్యవి సయుక్తికముగా నాతం డర్హుం డనిబోధించిన మనస్సు సమాధానపఱచుకొని కృతియిచ్చి నట్లు నిర్వచనోత్తరరామాయణములోని,

"సీ. సకలలోకప్రదీపకుఁ డగుపద్మినీ
            మిత్రవంశమున జన్మించె ననియుఁ
     జూచిన మగలైనఁ జొక్కెడు నట్టి సౌం
            దర్యసంపద సొంపు దాల్చె ననియు
     జనహృదయానందజననమై నెగడిన
            చతురతకల్మి నప్రతిముఁ డనియు
     మెఱసి యొండొంటికి మిగుల శౌర్యత్యాగ
            విఖ్యాతకీర్తిచే వెలసె సనియు

     వివిధవిద్యాపరిశ్రమవేది యనియు
     సరసబహుమానవిరచితశాలి యనియు
     మత్కృతీశ్వరుఁ డగుచున్న మనుమనృపతి
     సుభగుఁ గావించుటకు సముత్సుకుఁడ నైతి.”

అనుపద్యమువలనఁ దెల్ల మగుచున్నది. కావున ధనాపేక్షచేతఁ దిక్కన మనుమసిద్ధిరాజునకుఁ గృతి నొసంగి యుండలే దనుట స్పష్టము. ఏసంవత్సరమునఁ దిక్కన నిర్వచనోత్తర రామాయణమును రచించి మనుమసిద్దిరాజున కంకితముచేసెనో నిశ్చయముగాఁ దెలుపుట కాధారములేదుగాని భారతరచనకుఁ బూర్వము బహుసంవత్సరములకు, అనఁగా ముప్పదిసంవత్సరముల వయస్సులోపలనేరచించి యుండు నని స్పష్టముగాఁ జెప్పవచ్చును. అప్పటి కీకవిసత్తమునికీర్తి విద్వల్లోక మంతటను వ్యా