ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ యధ్యాయము

63


వచ్చి తిక్కనాదిమంత్రివర్గముతో నాలోచించి అన్నంభట్టను బ్రాహ్మణుని కాటమరాజుకడకు రాయబారినిగాఁ బంపిరి. కాటమరాజు పైనిజెప్పినకారణమును బురస్కరించుకొని పుల్లరి నీయక తగవులు పెట్టెను. అన్నంభట్టుప్రయత్నము నిష్క్రయోజన మయ్యెను. అతఁడు తిరిగివచ్చి యాసమాచారమంతయు మనుమసిద్ధిరాజునకు నివేదించెను. మనుమసిద్ధిరాజున కాగ్రహమువచ్చి కాటమరాజును దండించి పుల్లరి గైకొని కార్యమును సాధించుకొని రమ్మని ఖడ్గతిక్కనను నియమించెను. అప్పుడు రాజునాజ్ఞ శిరసావహించి సైన్యములను సమకూర్చెను. తిరునామాలతిప్పరాజు. శ్రీకంఠరాజు, పెదనేగిచొక్కరాజు, పెదవరదరాజుఁ అర్లుకొండ అచ్చిరాజు, ఆదివన్నెమన్నెరాజు, గయికొండగంగరాజు, ఉర్లకొండసోమన్న , ఉదయాద్రి ఉమ్మయ్య, చెన్నపట్టణము చంద్ర శేఖరుఁడు, దేవముని వెంగళయ్య, పట్టుకోట బసవరాజు, కాళహస్తి పాపతిమ్మరాజు, వెలకంచి వెంగళపతిరాజు, ప్రభగిరిపద్మశేఖరుఁడు, మొదలుగాఁగల యోధవరు లనేకులు మనుమసిద్దిపక్షమునఁ దోడ్పడ నేతెంచిరి. ఈ యోధులకందఱకు నాయకుఁడై ఖడ్గతిక్కన సిద్దిరాజు సేనలను నడిపించుకొని కాటమరాజుపై దండెత్తి పోయెను. మనుమసిద్ధితనపైదండెత్తిరా నున్నాఁడని ముందుగాఁ దెలిసికొని కాటమరాజు సయితము సైన్యములను సమకూర్చుకొని సిద్ధముగా నుండెను. పల్నాటిప్రభు వయిన