ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

తిక్కన సోమయాజి


మున నీతిక్కనృపతి పేరిట నొకదానశాసనము గానం బడుచున్నది. కావున నంతకుఁ బూర్వమె యీయుద్ధము జరిగి యుండునని యూహింపఁ దగును. ఈకారణముననే తిక్కరాజనేకులతో యుద్ధములు చేసి విజయములను బొంది ప్రఖ్యాతి కెక్కెను. దీనిని గూఁడ తిక్కనసోమయాజి తననిర్వచనోత్తర రామాయణమున,

"సీ. లకుమయ గురుములూరికి నెత్తి వచ్చిన
           గొనఁడె యాహవమున ఘోటకముల
     దర్పదుర్జయు లగు దాయాదనృపతుల
           ననిలోనఁ బఱపఁడే యాగ్రహమున,
     శంభురాజాది ప్రశస్తారి మండలి
           కముఁ జేర్చి యేలఁడే కంచి పురము,
     జేధి మండలము గాసిగఁ జేసి కాళవ
           పతి నియ్యకొలుపఁడే పలచమునకు

గీ. రాయ గండగోపాలు నరాతిభయద
   రాయ పెండారబిరుదాభిరాము నుభయ
   రాయగండాంకు ఖండియరాయుఁ దిక్క
   ధరణివిభుఁ బోలరాజుల కరిది గాదె"

అనుపద్యములో శంభురాజాది శత్రువులను జయించి కాంచీపురమును బాలించె నని తెలియఁ జేసి యున్నాఁడు. తిక్కరాజు పూర్వులు శైవమతావలంబకు లయినను తిక్కరాజు మాత్రము వైష్ణవభక్తుఁడై తనరాజ్యములోననేక విష్ణ్వాలయములను స్థాపించి వైష్ణవమతమునకుఁ బోషకుం