ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

తిక్కన సోమయాజి


చెల్లించెడు సామంతుఁడై పండ్రెండవ శతాబ్ద్యంతమునను, పదుమూడవ శతాబ్దప్రారంభమునను గావలి మొదలుకొని కాంచీపురము వఱకుఁ గలదేశమునంతయుఁ బరిపాలించి నట్లుశాసనములం బట్టి దెలియుచున్నది. ఇతఁడు శాసనములలో సల్లసిద్ధిరాజని వ్యవహరింపఁ బడియెను. ఇతనికి మిక్కిలి పరాక్రమవంతుఁ డైన తమ్ము సిద్ధిరా జనుతమ్ముఁ డొకఁడు గలఁడు. వీని శాసనములు నెల్లూరు, చిత్తూరు, చెంగల్పట్టు ముండలములలో బెక్కులు గానంబడుచున్నవి. మనుమసిద్దిరాజు మొదట విక్రమసింహపురము నందుగాక వల్లూరుపట్టణము రాజధానిగఁ జేసికొని మార్జవాడి (మహారాజపది) రాజ్యమును బరిపాలనముసేయుచుఁ గాంచీపురము పై దండెత్తిపోయి యా రాజువలనఁ గష్పము గైకొనుచుండె నని దెలియుచున్నది. క్రీ.శ. 1196 వ సంవత్సరమునకుఁ దరువాత త్రిభునన వీరదేవుఁ డైన మూఁడవ కులోత్తుంగు డసమానమైన గజబలంబుతోడ గాంచీపురముపై దండెత్తివచ్చి వీరకృత్యము లనేకములను గావించి విరోధులయినరాజుల నెల్లరను జయించి కాంచీపురమును జొచ్చి క్రోధాగ్ని చల్లాఱినవెనుకఁ గాంచీపురము మొదలుగ నుత్తరభాగము నంతటను గప్పము విధించి సామంతనృపతుల నుండి గైకొనుచుండెను[1] ఈ మనుమసిద్ది రాజుసకుఁ దిక్కరాజు జనించెను. శ్రీకాళహస్తిదేవుఁడు తిరుక్కాళత్తి దేవుఁ డని


'

  1. South Indian Inscriptions vol iii. p. 218.