ఈ పుట ఆమోదించబడ్డది

వసింపకుము. నీ తల్లి చనిపోయినపుడు ఆమెను నా ప్రక్కనే పాతిపెట్టుము. అటుపిమ్మట ఒకనాడు కూడ జాగుచేయక ఈ నగరము విడిచి వెళ్లిపొమ్మ ఇచటి ప్రజలు దుషులు. సిగ్గు సెరములేక పాపకార్యములు చేయువారు. నాదాబు అహీకారును భయపెట్టగా అతడు సమాధిలో దాగుకొనెను. ఐనను అహీకారు సమాధినుండి వెలుపలికి వచ్చి మరల వెలుగును చూచెను. కాని అహీకారును చంపయత్నించినందులకు దేవుడు నాదాబును నిత్యాంధకారములోనికి త్రోసివేసెను. అహీకారు దానధర్మములు చేసెను. కనుకనే అతడు నాదాబు పన్నిన మృత్యుపాశములలో తగుల్కొనలేదు. కాని నాదాబు తాను పనిన యురులలో తానే తగుల్కొని నాశమయ్యెను. 11. దీనిని బట్టియే దానము చేయుటవలన గలుగు మేలెట్టిదియో, కీడు తలపెట్టుటవలన కలుగు వినాశమెట్టిదియో గుర్తింపుడు. ఇతరులకు కీడు చేయుట వలన చావు మూడును. నాయునా! ఇక నా బలము సన్నగిల్లిపోవుచున్నది.

అంతట వారు తోబీతును పడుకమిద పరుండబెట్టగా అతడు కన్నుమూసెను. వారు అతనిని గౌరవమర్యాదలతో పాతిపెట్టిరి.

12. తరువాత తల్లి చనిపోగా తోబియా ఆమెను తండ్రి ప్రక్కనే పాతిపెట్టెను. తదనంతరము అతడు భార్యతోను పిల్లలతోను మేదియా దేశములోని ఎక్బటానాకు వెళ్ళి అచట తన మామయైన రగూవేలునింట వసించెను. 13. అతడు వృద్దులైన అత్తమామలను మిగులు గౌరవముతో జూచుకొనెను. ఆ వృద్దులు చనిపోయినపుడు వారిని ఎక్భటానాలోనే పాతిపెట్టెను. తోబియా తండ్రి యాస్తికివలె మామ యాస్తికిని వారసు అయ్యెను. 14. అతడు ఎల్లరిమన్ననలకు పాత్రుడై నూటపదునేడేండ్ల వరకును జీవించి తనువు చాలించెను. 15. తాను చనిపోకముందు నీనెవె నాశమగుటను గూర్చియు మేదియా రాజగు సియాఖరు నీనెవె పౌరులను బందీలనుగా గొనిపోవుటను గూర్చియు వినెను. ప్రభువు అస్సిరియా ప్రజలను నీనెవె పౌరులను శిక్షించినందులకు అతనిని స్తుతించెను. తోబియా చనిపోకముందు నీనెవె నగరమునకు పట్టిన దుర్గతిని జూచి సంతసించి నిత్యుడైన దేవునికి వందనములర్పించెను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/34&oldid=237532" నుండి వెలికితీశారు