ఈ పుట ఆమోదించబడ్డది

నన్ను పంపిన దేవుని చెంతకు వెళ్లవలయును. మిరాకు జరిగిన సంఘటనములన్నిటిని పుస్తకమున వ్రాసియుంచుకొనుడు" అని చెప్పెను.

21. ఇట్లు చెప్పి దేవదూత ఆకాశమున కెగసెను. తోబీతు తోబియా నేలమిూదినుండి లేచి నిలుచుండిరి. కాని అతడు వారికి మరల కన్పింపలేదు. 22. వారు కీర్తనలతో దేవుని స్తుతించిరి. దేవదూత తమచెంతనున్నపుడు ఆ ప్రభువు తమకు చేసిన అద్భుత కార్యములకు అతనిని కొండాడిరి.


12. నీనెవె

14. 1–2 తోబీతు పై రీతిగా స్తుతిగీతమును ముగించెను. గ్రుడ్డివాడగునప్పటికి తోబీతునకు అరువదిరెండేండ్లు. దృష్టిని బడిసిన పిదప అతడు మరల సంపన్నుడాయెను. మరల దానధర్మములు చేసెను. దేవుని స్తుతించి అతని మాహాత్మ్యమును ఎల్లరికిని వెల్లడిచేసెను. అటుతరువాత నతడు తన నూట పండ్రెండవయేట పరమపదించెను. అతనిని నీనెవె నగరముననే గౌరవప్రదముగా పాతిపెట్టి පි.

3. తోబీతు చనిపోక ముందు కుమారుని బిల్చి ఇట్లపదేశము చేసెను. 4 "నాయనా! నీవు నీ పిల్లలను తీసికొని సత్వరమే మేదియాకు వెళ్లిపొమ్మ నీనెవె పట్టణమునకు శిక్షపడునని ప్రభువు నహూము ప్రవక్త చేత పలికించిన ప్రవచనము అనతి కాలముననే నెరవేరితీరునని నా నమ్మకము. నీనెవె నగరమును గూర్చియు అస్సిరియా రాజ్యమును గూర్చియు ప్రభువు దూతలైన యిస్రాయేలు ప్రవక్తలు పల్కిన ప్రవచనములన్నియు నెరవేరి తీరును. తగుకాలము వచ్చినపుడు వారు చెప్పిన సంగతులన్నియు నెరవేరును. ప్రభువు పలికిన పలుకులు తప్పక నెరవేరునని నేను గాఢముగా విశ్వసించుచున్నాను. ప్రవక్తల ప్రవచనములలో ఒకటియు తప్పిపోదు. き。 మట్టుకు నీవు అస్సిరియా బాబిలోను దేశములలో కంటె మేదియాలోనే భద్రముగా నుందువు.

శత్రువులు యిస్రాయేలు దేశమున వసించు మనతోడి యూదులను ఆ గడ్డమిదనుండి చెదరగొట్టి ప్రవాసమునకు కొనిపోవుదురు. యిస్రాయేలు దేశమంతయు బీడుపడును. సమరియా యెరూషలేము నగరములు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/32&oldid=237530" నుండి వెలికితీశారు