ఈ పుట ఆమోదించబడ్డది

మనవిమాట

తోబీతు గ్రంథము బైబులులోని పూర్వవేదపు పుస్తకములలో ఒకటి. తోబీతు భక్తుని కథ రమ్యమైనది. పేదలకు దానధర్ధములు మొదలగు కరుణకార్యములు చేయుట, తల్లిదండ్రులను పెద్దలను గౌరవించుట, పవిత్రముగా జీవించుట, దేవుని యూజ్ఞలను పాటించుట, ఆ ప్రభువుకి భక్తితో ప్రార్ధనము చేసి అతనికి కృతజ్ఞులమై యుండుట మొదలగు కుటుంబ ధర్మములు ఈ పొత్తమున వర్ణింపబడినవి. దేవుడు దేవదూత ద్వారా తన భక్తులను రక్షించుటయు ఇందు సొగసుగా చిత్రింపబడినది.

ఈ యనువాదము క్యాతలిక్ అనువాదక సంఘము వారు క్రొత్తగా చేయించినది. ఈ తోబీతు కథను హైస్కూల్ విద్యార్ధులు ఆస్తక్తితో చదువుకొందురని ఆశించుచున్నాము.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/2&oldid=237516" నుండి వెలికితీశారు