ఈ పుట ఆమోదించబడ్డది

15. దేవదూత "ఓయి! నీవింతలోనే మినా తండ్రి యుపదేశమును మరచితివా? అతడు నీవు మిరా తెగనుండియే వధువు నెన్నుకోవలయునని చెప్పలేదా? కనుక ఇప్పడు నా మాట వినుము. ఆ భూతమును తలంచుకొని భయపడకుము. సారాను స్వీకరింపము. ఈ రాత్రియే రగూవేలు ఆ యువతిని నీకు ప్రధానము చేయును. 16. నీవామెతో పడుకగదిలోనికి పోయినపుడు చేపగుండెను, కాలేయమును తీసికొని కాలుచున్న సాంబ్రాణి మిూద వేయుము. 17. వెంటనే గదియంతట వాసన వ్యాపించును. ఆ వాసనకు భూతము పారిపోవును. అది మరల సారా చెంతకు రాదు. నీ వా యువతిని కూడకముందే మిరిరువురును లేచి నిలుచుండి దేవుని ప్రార్ధింపడు. స్వర్గములోని దేవుడు మిమ్మ చల్లనిచూపు చూచి భూతము పీడ నుండి కాపాడవలయునని మనవి చేయుడు. నీ వేమాత్రము భయపడవలదు. నృష్యాదినుండియు సారా నీకు వధువుగా నిర్ణయింపబడినది. ఆమెకు పిశాచ బాధనుండి విముక్తి కలిగింప వలసినదియు నీవే. ఆమె నీవెంట మిరా యింటికి వచ్చును. మికు బిడ్డలు కలుగుదురు. వారిని నీవు అనురాగముతో చూచుకొందువు. నామాట నమ్మము" అని పల్కెను.

తోబియా రఫాయేలు చెప్పిన మాటలు వినెను. తండ్రివైపున సారా తనకు చుట్టమని గ్రహించెను. అతడు సారాను గాఢముగా ప్రేమించి తన హృదయమును ఆమె కర్పించెను.


7. రగూవేలు

7. 1. వారు ఎక్బటానా నగరమును చేరగానే తోబియా నేస్తమా అసరయా! నన్ను వెంటనే రగూవేలు నింటికి తీసికొనిపొమ్మ అని యనెను. దేవదూత తోబియాను అతని యింటికి కొనిపోయెను. వారు వెళ్లునప్పటికి రగూవేలు తన లోగిలి ముంగిట తలుపువొద్ద కూర్చుండియుండెను. వారే మొదట రగూవేలును పలుకరించిరి. అతడు సోదరులారా! మిరాకు స్వాగతమని చెప్పి వారిని యింటిలోనికి తీసుకొనిపోయెను. 2. తన భార్య

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/19&oldid=237515" నుండి వెలికితీశారు