ఈ పుట ఆమోదించబడ్డది

బెంగ పెట్టుకొనకుము. 21. యోగ్యుడైన దేవదూత మన బిడ్డనితో బోవును. వాడు ప్రయాణమును విజయవంతముగా ముగించుకొని క్షేమముగా తిరిగివచ్చును" అని పల్కెను. ఆ మాటలలకు అన్నా యేడ్పు చాలించెను.


6. మత్స్యము

6. 1. తోబియా దేవదూతతో పయనమయ్యెను. అతని కుక్కగూడ అతని వెంట బోయెను. వారు మునిమాపు వరకు నడక సాగించి టిగ్రీస్ నదీతీరమున విడిది చేసిరి. 2. తోబియా కాళ్లు కడుగుకొనుటకు ఏటిలోనికి దిగెను. వెంటనే పెద్ద చేపయోుకటి నీటిలోనుండి దుమికివచ్చి అతని పాదము బట్టుకోబోయెను. దానిని జూచి ఆ కుర్రడు పెద్దగా కేకపెట్టెను. 3. దేవదూత యతనితో "ఓయి! ఆ మత్స్యమును పట్టుకొమ్మ జారిపోనీకుము" అని యనెను. తోబియా మినమును పట్టుకొని ఒడ్డునకు లాగెను. 4 దేవదూత “చేప కడుపును చీల్చి దాని పిత్తమును కాలేయమును గుండెను తీసి నీ యొద్ద నుంచుకొనుము. దాని ప్రేవులను మాత్రము అవతల పారవేయుము" అని చెప్పెను. 5. తోబియా దేవదూత చెప్పినట్లే చేసెను. అతడు చేపలో కొంతభాగమును కాల్చి భుజించెను. మరికొంత భాగమును ఉప్పలో ఊరవేసెను. తరువాత వారివురు ప్రయాణము సాగించి మేదియా దరిదాపులలోనికి వచ్చిరి.

6. ఆ యువకుడు దేవదూతను జూచి నేస్తమా! అసరయూ! చేపపిత్తము కాలేయము గుండెలతో ఏయే రోగములను కుదర్చవచ్చును?" అనియడిగెను. 7. అతడు చేప గుండెను కాలేయమును కాల్చి పొగవేసినచో నరులను పట్టి పీడించు భూతముగాని పిశాచముగాని పారిపోవును. ఆ నరులకు మరల పిశాచబాధ సోకదు. 8. పిత్తమును తెల్లని పొరలు కమ్మినవారి కన్నులకు లేపనముగా ఉపయోగింపవచ్చును. దానిని కంటిపొరల మిరాద పూసి వాని మిద ఊదినచాలు పొరలు తొలగిపోవును" అని చెప్పెను.

9. వారిరువురు మేదియా దేశమును ప్రవేశించి ఎక్బటానా నగరమును సమిపించిరి. 10. అప్పడు దేవదూత తోబియాను

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/17&oldid=237513" నుండి వెలికితీశారు