ఈ పుట ఆమోదించబడ్డది

బట్టలిమ్మ, నీకు సమృద్ధిగా నున్న ప్రతివస్తువు నుండియు కొంతభాగము దానముగా నిమ్మ ఇచ్చెడు దానిని ప్రీతితో నిమ్మ 17. పుణ్యాత్ములు చనిపోయినప్పడు వారి కుటుంబమునకు అన్నము పెట్టుము. కాని పాపాత్ములు చనిపోయినపుడు ఈ కార్యము చేయవలదు.

18. బుద్దిమంతుల సలహాలను పాటింపుము. మంచి యుపదేశ మును ఎప్పడును పెడచివిని బెట్టవద్దు. 19. ప్రతి కార్యమునందును దేవుని స్తుతింపుము. నీవు చేపట్టిన కార్యములనెల్ల సఫలము చేయుమని అతనిని వేడికొనుము. అతడు ఇతర జాతులకు వివేకమును దయచేయడు. నరులకు మంచి వరములన్నిటిని దయచేయువాడు ప్రభువే. కాని అతడు జనులను పాతాళమునకు అణగ ద్రౌక్కువాడుకూడ. నాయనా! నీవు ఈ యుపదేశముల నెల్ల జ్ఞప్తియందుంచు కొనుము. వీనిని నీ హృదయము నందు మాసిపోనీకుము.

20. కుమారా! నేను మేదియా దేశములోని రాగీసు పట్టణమున వసించు గాబ్రియూ కుమారుడు గబాయేలు నొద్ద పదిసంచుల వెండి నాణెములు దాచియుంచితిని. 21. ఇప్పడు మనము పేదవారలమైతిమి. కాని దీనికి నీవు విచారపడనక్కరలేదు. దేవునికి వెరచి పాపకార్యములను విడనాడి అతనికి ప్రియములగు పనులను చేయుదువేని నీకు పెద్ద సంపద యబ్బినట్లే."


5. ప్రయాణ స్నేహితుడు

5. 1. తోబియా తండ్రితో “నేను నీవు చెప్పినదెల్ల చేయుదును. 2. కాని నేను గబాయేలు నుండి డబ్బు తెచ్చుకొనుటయెట్లు? నేనతని నెరుగను, అతడు నన్నెరుగడు. అతడు నన్ను నమ్మినాకు సొమ్మునిచ్చుటకు నేనతనికి ఏమి యూనవాలు చూపవలయును? అదియును గాక మేదియాకు ఏ త్రోవన బోవలయునో నాకు తెనియదు" అని యనెను. 3. అందులకు తోబీతు కుమారునితో "పూర్వము నేను గబాయేలు ఒక పత్రముపై సంతకము చేసితిమి. దానినిముక్కలుగా చించి నేనొక ముక్కను

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/13&oldid=237509" నుండి వెలికితీశారు