ఈ పుట ఆమోదించబడ్డది

మరల చూపు దయచేయుటకును, సారా తోబియాలకు పెండ్లి కుదుర్చు టకును, ఆమెనుండి ఆస్మోదియసు అను దుష్టపిశాచమును పారద్రోలు టకును దేవుడు ఆ దూతను పంపెను. తోబియా సారాకు అయినవాడు కనుక ఆమెను పెండ్లియాడు హక్కు ఇతర వరులందరికంటెగూడ అదనముగా అతనికి గలదు. అచట తోబీతు ముంగిటి నుండి ఇంటిలోనికి అడుగుపెట్టినపుడే ఇచ్చట సారా కూడ మీది గదినుండి క్రిందికి దిగివచ్చెను.


4. తోబియా

4.1. అదియే దినమున తోబీతు పూర్వము తాను మేదియా దేశమునందలి రాగీసుపట్టణమున గబాయేలు నింట దాచియుంచిన ధన మును జ్ఞప్తికి తెచ్చుకొనెను. 2. అతడు నాకిపుడు చావు రావలయునని ప్రార్ధన చేసికొంటినిగదా! కాని నేను చనిపోకముందు నా కుమారుడైన తోబియాకు ఆ డబ్బు సంగతి చెప్పవలయునుగదా అనుకొనెను. 3-4 కనుక అతడు పుత్రుని పిల్చి ఇట్లు చెప్పెను. “నాయనా! నేను చనిపోయినపుడు నన్ను అన్ని మర్యాదలతో భూస్థాపనము చేయుము. నేను దాటిపోయిన తరువాత మీ యమ్మను గౌవముతో జూడుము. ఆమె బ్రతికి యున్నంతకాలము ఆమెను పోషింపుము. ఆమె చనిపోయినపుడు నా పక్కనే పాతిపెట్చుము. నిన్ను గర్భమున మోసి కనినపుడు ఆమెయెన్ని అపాయములకు గురియైనదో జ్ఞప్తికి తెచ్చుకొనుము. కనుక నీవు ఆమె కోరినదెల్ల చేయుము. ఎన్నడును నీ తల్లి మనసు కష్టపెట్టకుము.

5. నీ జీవితమున ప్రతి దినమును ప్రభువును గుర్తుంచుకొనుము. ఏనాడును పాపము చేయకుము. దేవుని ఆజ్ఞ మిూరకుము. ఎప్పడును సత్కార్యాములే చేయుము. దుష్కార్యములు మానుకొనుము. 6. నీవు సత్యవర్తనుడ వయ్యెదవేని ప్రతికార్యమునను నీకు విజయము చేకూరును.

7. దేవునిపట్ల భయభక్తులు చూపువారికి నీ సౌత్తునుండి దానధర్మములు చేయుము. నీవు పేదలను అనాదరము చేయకుందువేని దేవుడు నిన్ను అనాదరము చేయడు. 8. నీ కున్న దానిని బట్టి దానము

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/11&oldid=237507" నుండి వెలికితీశారు