ఈ పుట ఆమోదించబడ్డది

కార్యములు మాత్రము అర్థహీనమై నిలచియున్నవి. మానవజీవితములో అతి ముఖ్యమైన పెళ్లిదినమున జ్ఞానము మీద ధ్యాసలేకుండ పోవడము ఖగోళములో గ్రహములరూపములలోనున్న వారికి ఆగ్రహమును కల్గించు చున్నది. అందువలన పెళ్లి ప్రయాణము చేయు వాహనములను ప్రమాదము నకు గురిచేయుచున్నారు. మానవుని హృదయములో జ్ఞానమును పెళ్లి కార్యముల ద్వార ప్రతిష్ఠించుకోవలసియుండగ ఆ దినమును విలాసముగ గడపుట, నగలు, ఖరీదైన దుస్తులు ధరించి ధర్పముచూపుట జ్ఞానమువిలువ తెలిసిన సూక్ష్మగ్రహములకు సరిపోలేదు. కావున వివాహకార్యములో కాని ప్రయాణములో కాని ప్రమాదములు కల్గించుటకు గ్రహములు పొంచియుందురు. అందువలననే బాగా పరిశీలిస్తే పెళ్లి వాహనములే ఎక్కువ ప్రమాదమునకు గురియగుచుండును.


పెళ్లిదినమున పెళ్లికార్యములలో జ్ఞానమును తెలిపిన, తెలుప కుండిన మానవుడు అజ్ఞానమువైపు ప్రయాణించుచున్నాడు. ఆ దినము నుండి మాయలో పూర్తిగా మునిగిపోవుచున్నాడు. కావున వివాహము మానవునికి అశుభమును చేకూర్చునదే అవుచున్నది. కావున "కళ్యాణ పాప్తిరస్తు" అని ఎవరైన నేటికాలములో దీవించిన అది చెడును చేయునదే అయియుండుట వలన దానిని వాస్తవముగ దూషణక్రిందికే లెక్కించవలసి యున్నది. 'శ్రీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు' అనుటలో తొందరగ వివాహము కావలెనని అర్థముగలదు. వివాహమగుట వలన అశాంతి ప్రారంభమగును, కావున నేడుగల ఆ దీవెనను తిట్లలోనికి లెక్కించ వలసినదే. కొందరి జీవితములలో వివాహజీవితము మొదట సంతోషముతో కూడుకున్న జీవితముగనే కనపించినప్పటికి అది దైవమునకు దూరముచేయునదై చివరకు జీవితమునకే అనర్థమును చేకూర్చుచున్నది. అందువలన