ఈ పుట ఆమోదించబడ్డది

స్వామీజీ ఇచ్చిన దీవెన ప్రకారము అతనిలో ప్రేరేపణ మొదలైనది. ఇతని దగ్గర డబ్బున్నది నాకొక్కనికే తెలుసు, ఈమార్గములో ఇతను నావెంట వచ్చునది నాకొక్కనికే తెలుసు, ఇతని నుండి డబ్బును ఎదోవొక విధముగ లాగేసుకుంటే ఒక్కమారుగ ధనికుడునై పోవచ్చుననుకొన్నాడు. దాని కొరకు నడుస్తూనే ప్రణాళికను తయారుచేసుకోసాగాడు. అంతలోనే అతనికొక ఆలోచన తలలో మెరిసింది. అది అడవి మార్గము కావున చాలారకముల చెట్లుగలవు వాటిలో విషముష్ఠి చెట్లు దానికి కాయలుండడము కనిపించిది. ఎర్రగ అందముగ కనిపించు ఆ కాయను అతనిచేత తినిపిస్తే తనపని నెరవేరుతుందనుకొన్నాడు. వెంటనే ధనంజయ తోటి ప్రయాణికునికి కాయను చూపి ఈ కాయ ఇక్కడ తప్ప ఎక్కడ దొరకదు, ఈ కాయ పేరు ముష్ఠికాయ, దీనిని తినుట వలన ముష్ఠిబలమేర్పడుతుంది. వృద్దాప్యము వరకు మగతనము తరగక ఉంటుంది. దీనివలన సంపూర్ణ ఆరోగ్యము ఏర్పడుతుంది. మన అదృష్టముకొలది ఈ చెట్టు కనిపించింది, దీనిని తప్పక తిందామని చెప్పగ ఆమాటకు ప్రయాణికుడు కూడ ఒప్పుకొన్నాడు. మిగతవారికంటే నాలో మగతనము తక్కువ ఉందని ఆ ప్రయాణికునికి మొదటినుండి అనుమానముండుట వలన మగతనమును గురించి చెప్పగనే సరేనని కాయను తినుటకు ఆసక్తిని కనబరిచాడు.


ఇదే మంచి సమయమని తలచిన ధనంజయ వెంటనే చెట్టెక్కి బాగా ఎర్రగ కనిపించిన ఒక కాయను త్రుంచి క్రిందికి వేశాడు. తాను కూడ మరొక కాయను తీసుకొని క్రిందికి దిగివచ్చి ముందు ఒక కాయను పగలగొట్టి అందులోని విత్తనములను తీసివేసి గుజ్జును ప్రయాణికుని చేత తినిపించాడు. తర్వాత తానుకూడ కాయను పగులగొట్టి తినునట్లు నోటిలో పెట్టుకొని మూత్రవిసర్జన కొరకు ప్రక్కకు పోయి నోటిలోని గుజ్జును క్రిందకి