ఈ పుట ఆమోదించబడ్డది

చెక్కు చెదరకుండ మరియు శుభ్రముగ ఉన్నపుడు తినుటకు యోగ్యముగ ఉండును. పండుకు రంద్రములు పడికాని, లేక పండు చీలిపోయి అందులోనికి దుమ్ముధూళి పోయి, క్రిమికీటకములు చేరినపుడు తినుటకు యోగ్యముగ లేకుండా వృథా అయిపోవును. అలాగే కర్మఫలము కూడ జ్ఞానమను పురుగుచే తొలచబడినపుడు, గురుదీవెన అనెడి చీలిక ఏర్పడినపుడు అది చెడిపోయి కర్మఫలము అనుభవించుటకు యోగ్యముగ లేకుండపోవును. కర్మఫలము లేనపుడు మానవునికి ముక్తి లభించునని తెలిసిన పెద్దలు తమకు ప్రియమైన జ్ఞానశిష్యులను "నీ తలపండు పగలనాని" అని దీవించెడివారు. కర్మయను పండు పగిలిపోయి నశించి పోవలెనని, దానివలన ముక్తి కలుగవలెననుట మంచి శుభమైన ఉద్దేశము, కావున ఈ మాటను దీవెన అనుట సమంజసము. అజ్ఞానము తో అర్థము చేసుకోలేక అశుభమైన తిట్టుగ అను కోవడము అసమంజసము. ప్రతి మాటను జ్ఞానవివరముగ యోచించినపుడే అందులోని సారాంశము అర్థమగును" అని చెప్పిన జంబుకేశ్వరుడు దీవెనను దూషణగ అర్థము చేసుకొన్న చిన్న శిష్యుని గురించి యోచించి అతనిలో ఇంకా జ్ఞానము వృద్ది కావలసివుందని అనుకొన్నాడు. అతనికి కూడ జ్ఞానము సంపూర్ణముగ కల్గి జ్ఞానములోని సూక్ష్మమైన అర్థములను గ్రహించునట్లు చేయాలనుకొన్నాడు.

-***-


నీ శిరస్సున దీపమెలగ

గురువుగారు జ్ఞానబోధలు చేస్తు కొంతకాలము గడిపాడు. అప్పటికి కొంత జ్ఞానలోపమున్నదని గ్రహించిన జంబుకేశ్వరుడు ఒక శుభ సమయమున చిన్న శిష్యునికి కూడ ఒక దీవెన ఇచ్చాడు. అది నీ