ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠప్రకరణము

89


నది సత్యమగుటకు సందియములేదు. ఇట్టిపని జరిగినవెనుక నెల్లవారును రాయనిపట్లను మంత్రిపట్లను భయభక్తులతో వర్తించుచుండిరి.

ఇతర సంస్కరణములు

కృష్ణదేవరాయఁడు సింహాసనారూఢుఁ డగుటకు బూర్వము సేనలోఁ గొంతభాగము రాయనివశమునను, మఱికొంతభాగము సామంతప్రభువుల వశమున నుండెడిది. ఈమహారాజ్య మంతయును నాయకరములుగా విభాగింపఁబడి యొక్కొక్క నాయకర మొక్కొక్క రాజాజ్ఞానువర్తియగు నాయకునిచేఁ బరిపాలింపఁబడుచుండెను. ఈనాయకులు రెండు విధములైన తెగలుగ విభాగింపఁబడి యుండిరి. ఒకతెగ నాయకులు తాము జీతములు గైకొనుచుఁ దమనాయకరములో సంపాదించిన యార్షనమంతయును నగరికిఁ బంపెడియాచారము గలవారుగ నుండిరి. వీనినే కేవలనాయకులని చెప్పఁదగును, మఱియొకతెగ నాయకులు గలరు. వీరు పుత్త్రపౌత్త్రానుక్రమముగాఁ బరిపాలనముచేయు సామంతరాజులు. వీరినే అమరనాయకు లందురు. వీరు తమరాజునకై గొంతసేనను సిద్ధపఱచి యుంచు పద్ధతికి లోఁబడి తమనాయకరము లనుభవించుచుండెడివారు. నియమించిన విధమున వీరలకడ నుండు సైన్యములు సంఖ్యలో గొఱవడి యుండుటయెగాక గుణముచేతను గొఱవడియుండుటఁ గనుపెట్టి తిమ్మరుసుమంత్రి యాసైన్యములను సమకూర్చు