ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

తిమ్మరుసు మంత్రి


వారు రెండు సంవత్సరముల కాలము వేచి యున్నపక్షమున నేను చెప్పిన చొప్పున సామ్రాజ్యమును దిటవు పఱచి దండయాత్రలకు సైన్యము సన్నద్ధము గావింతును. ఎదిరిబలమునకును తనబలమునకును గల తారతమ్యమును దెలిసికొనకుండ యుద్దమునకుఁ గడంగుట చేటునకు మూలము. అసాధ్యమైనది ప్రజ్ఞచే సాధ్యమగును. నీవు సాహసంబున విక్రమార్కుని మించినవాఁడ వౌదువు. నీవు సంగ్రామధనంజయుండవని నేనెఱుంగుదు. నీవు శత్రువుల నవలీల జయింతువు. అందులకు సందియములేదు గాని నేఁ జేయఁబూనిన రాజ్యాంగసైన్య సంస్కారములు ముగియునంతవఱకు నొకించుక కాలము వేచి యుండుట శ్రేయోదాయకము.”

అని బోధించి పిమ్మట తిమ్మరుసుమంత్రి సైన్యసంస్కరణమునకుఁ గడంగెను.

ప్రధమ సంస్కరణము

తనయెడఁ గృష్ణదేవరాయనికి నసూయ జనింపఁజేయు మార్గమునఁ బోక, కార్యసాఫల్యమునే ప్రధానముగాఁ జూచుకొని, తనపై మహాప్రభువునకు భక్తివిశ్వాసములు ముప్పిరిగొను విధముగాఁ బ్రవర్తింపుచుఁ గార్యకౌశల్యమును జూపుచు తిమ్మరుసుమంత్రి జాగరూకుఁడై మెలంగుచుండెను. అయిన రాయనికిఁ దనపై నసూయ పుట్టింపఁ గొందఱు సామంతప్రభువు లపవాదములను వేయుచుండిరి. కృష్ణదేవరాయఁడు