ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠప్రకరణము

83


భయంబు లేర్పడఁ బలికిన తిమ్మరుసు పలుకుల కానందించి రాయండు సదయాత్ముండై యిట్లనియె.

కృష్ణరాయని ప్రార్థనము

మహారాజాధిరాజునై యుండి నేనిట్లొంటరిగాఁ జనుదెంచుట తగనిపని యని నామనంబుస కిప్పుడు దృఢముగాఁ దట్టినది. నారాకను తెలిసికొని రక్షకసైన్యముతో వచ్చినన్ను సంరక్షించి పితృవాత్సల్యమును జూపినందులకు నీకు నేనెంతయుఁ గృతజ్ఞుఁడను. నీహితోపదేశమును శిరసావహించినాఁడను. మహాత్మా! నేను దుష్టనిగ్రహమును శిష్టజనపరిపాలనమును జేసి జగంబున నాచంద్రార్కస్థాయిగా గీర్తిగాంచునట్లనుగ్రహించి నీవును శాశ్వతమైన యశస్సును బడయుము. నాతండ్రి నరసింహదేవరాయఁడు గాని, నాసోదరుఁడు వీరనరసింహదేవరాయఁడు గాని, యీసామ్రాజ్యమును సంపాదించిన సాళ్వ నరసింహరాయఁడు గాని సాధింపలేక విడిచిపెట్టినకార్యములను నేను నిర్వహించుమార్గమును నాకుఁ జూపి నీవుతోడ్పడి విజయమును సమకూర్చవలయును. రాచూరు, ముదిగల్లుదుర్గములు విజాపురసుల్తానుచే నాక్రమింపఁబడినవి. ప్రాగ్దిశాభాగమున నుదయగిరి వఱకు గల ప్రదేశమును గజపతు లాక్రమించుకొనిరి. ఆ దేశములనుండి శత్రురాజులను తఱిమివేసి యాభాగములను మదీయసామ్రాజ్యమునఁ జేర్చుకొని దక్షిణహిందూస్థానమున నేకచ్ఛత్రాధిపత్యమును వహించి పరిపాలింప వలయుసని నాకు