ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(12)

పంచమ ప్రకరణము

71


కుమారతిమ్మభూపాలమౌళియు నింక ననేకు లాపట్టాభిషేక మహోత్సవమును సందర్శింప నేతెంచిరి. ఇట్లుండ సింహాసనాధిరోహణ సమయము తటస్థము కాఁగాఁ గృష్ణరాయనికిఁ బన్నీట జలకమార్చి, కిరీటాంగదాదుల సమర్పించి సర్వాభరణభూషితుం గావించి యిలు బయలుదేఱు సమయం బిదె వచ్చెనని తెలియఁ బఱచ, నందు కారాకొమరుండు సిద్దముగా నున్నాఁడ నని తెలిపెను. పిమ్మట తిమ్మరుసుమంత్రి యొక విచిత్రమైనకథ నడిపించెనఁట! తిమ్మరునుమంత్రి కృష్ణదేవరాయనితో నొకరహస్యము చెప్పవలసి యున్నదని యతని నొకగదిలోనికిఁ గొని బోయి తలుపుచాటునకు రమ్మని చేరఁదీసి యిదె రహస్యమని యొక చెంపకాయఁ దనసత్తువుతోఁ గొట్టెనఁట ! ఆచెంప పెట్టునకు కన్నుల నీరుగ్రమ్మి నెత్తురు తలకెక్కి తల దిమ్మెత్తఁ గృష్ణరాయఁడు చతికిలంబడియెనఁట ! తనకంట నీరు నించుచు త్రిమరు సాతనిముంగటఁ గూరుచుండి యుండెనట ! కొంతవడికి నారా కొమరుఁడు తెప్పిరిల్లి కన్నులు విచ్చి తిమ్మరుసును వీక్షించే నఁట ! అంత తిమ్మరుసు రాయనిం గౌఁగిలించికొని ముద్దాడి యిట్లనియెన్నఁట!

"అన్నా! నీ దేహము నొచ్చెనని నన్ను దూషింపకుము. ఈపనిఁ జేయటకుఁ జేతులాడక యిన్నిదినంబు లూరకున్నాఁడను. ఇఁక నూరకయున్న స్వామిద్రోహము చేసినవాఁడ నగుదు నన్న భయముచేత నిపు డీకృత్యము నెఱపితిని నన్ను మన్నింపుము" అని మంత్రిశేఖరుఁడు పలుక నతఁ డచ్చెరువంది తన