ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమ ప్రకరణము

69


మైన కష్టమును బోరాటమును లేకుండ నుపభోగింపుమని మహాసామ్రాజ్యవైభవము నంతయుఁ గృష్ణరాయని హస్తము నందుంచి యతనికిఁ జేసిన వాగ్దానమును నెఱవేర్చుకొనియెను. అదివఱకె తిమ్మరుసునకుఁగల స్వామిభక్తియుఁ బ్రజాసంరక్షణా సక్తియు లోకములో వ్యాప్తమై యున్నందునఁ బ్రజలెల్లరును తిమ్మరుసే తమ కేళుగడయని నమ్మి విశ్వాసముతోఁ గార్యములలోఁ నతిశ్రద్ధాళురై తోడ్పడుచుండిరి. తక్కుంగల భృత్యపరివారసామంతవర్గము తిమ్మరుసును పితృసమునిగా భావింపుచు భయభక్తులతో వినయవిధేయులై వర్తింపుచుండిరి. ఇట్టి మహావైభవపదవియంచున్న తిమ్మరుసు నెదుర్కొని యెవ్వడు బ్రదుకుఁ గాంచును? కావున నెవ్వరును గృష్ణరాయని రాజ్యాభిషేకము నడ్డుకొనువారు లేకపోయిరి.

రాజ్యపట్టాభిషేకము.

తిమ్మరుసుమంత్రి శా. శ. 1430 కి సరియైన శుక్లనామసంవత్సర మాఘశుద్ద చతుర్ధశినాఁడు (1509-దవ సంవత్సరము ఫిబ్రవరి 4 వ తేది) సామ్రాజ్యాభిషిక్తునిఁ గావించుటకు నిశ్చయించి సామ్రాజ్యమునందంతటఁ బ్రకటింపఁజేసెను. మహారాజులకు సామంతనృపవర్గమున కాహ్వానముల నంపించెను. అతఁడు మహాద్భుతముగా విజయనగరము సలంకరింపఁజేసెను. ఇతరస్థలములందుండిన సైన్యములను బెక్కింటిని రాజధానికి రప్పించెను. విజయనగర మెట్లలంకరింపఁజేసెనో యావిధ