ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

తిమ్మరుసు మంత్రి


తిమ్మరుసు నోటనుండి వెలువడినందున నిక్కముగాఁ నాతఁడు తన కన్నులను బెఱికించుటకై పిలువనంసి రప్పించి యుండునని భావించి సంభ్రమముఁజెంది గద్గదభాషియై తిమ్మరుసు కాళ్లపైఁ బడి "అప్పాజీ ! నాసవతితల్లి తిప్పాంబ విషముపెట్టించి చంపించవలెనని ప్రయత్నించునపుడెల్లను విఘాతము లాచరించి నన్ను సంరక్షించితివి. విద్యాబుద్ధులు గఱపి పెక్కు రాజనీతు లుపదేశించితివి. ఇప్పటికిని గంటికి ఱెప్పవలెఁ గాచుఁచున్నాడవు. కాని మాయన్నకు గాని సామ్రాజ్యమునకుఁగాని నేను చేసిన ద్రోహమెద్దియునులేదు. తన కుమారున కపకృతి చేయుదునని కదా మాయన్న నాకన్నులను బెఱికింప నాజ్ఞాపించినది ! సామ్రాజ్యముగాని, సామ్రాజ్యమున నేయధికారముఁగాని నాకక్కఱలేదు. నేను వైరాగ్యమును బూని జోగినై విహరింతును. అన్యాయముగా నాకన్నుల నేల పెఱికించెదరు? నన్ను రక్షించి విడువుము. దేశాంతరముపోయి బ్రదుకుగాంచెదను. నన్ను విడువ నీకు వలను పడదేని కన్నులను బెఱికించుటకు మాఱు శిరచ్చేదమును గావింపుము. నీకెంతయుఁ బుణ్యము గలుగు” నని కన్నీరు గార్చుచు బ్రతిమాలుకొనియెను. అతని యారాటమును గాంచి జూలినొంది తిమ్మరుసుమంత్రి వాని వీపు తట్టుచుఁ గుమారా ! నీకు వచ్చిన భయములేదు. నిన్ను నేను కాపాడి యీసామ్రాజ్యమున కభిషిక్తుని గావింప సంకల్పించి యున్నవాడను. వీరనరసింహరాయఁడు