ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(10)

చతుర్థ ప్రకరణము

63


ఇతఁడు చాలకాలమునుండి తిమ్మరుసునెడ ననుమానమును, కృష్ణరాయనియెడ నీర్షయుఁ గలవాడై యుండెను. తనకును, తనసంతతివారికిని లేకుండఁ జేసి కృష్ణరాయఁడు సామ్రాజ్య మపహరించు నన్నభయము కలదు. అతనియెడఁ బక్షపాతి గావున, తిమ్మరు సాతనికిఁ తోడ్పడునని పెద్దయనుమానముతో నుండెను. కృష్ణరాయని నాతని తమ్ములను జంపింప నూహించెను గాని తిమ్మరుసునెడఁగల భయముచేత సాహసింపఁజాల డయ్యెను. ఈయాఱేండ్లును తిమ్మరుసునెడఁగల భయముచేతఁ బైకి ప్రేమానురాగము లుట్టిపడు చున్నట్లుగా బ్రవర్తించుచు దనకుటిలస్వభావమును బయలుపుచ్చకయున్నను అవసానదశయందుఁ దనదుష్టబుద్ధి వెల్లడింపక తప్పినది కాదు. తనయనంతరము తిమ్మరుసు కృష్ణారాయనిఁ బట్టాభిషిక్తుని గావించునని దృఢముగా నమ్మియున్నవాఁ డగుటచేతఁ గాటికి గాళ్లుచాచుకొని మంచముపైఁ బన్నుండి లేవలేనిస్థితిలో నుండి తిమ్మరుసును రహస్యముగా బిలువనంపించి యిట్లనియెను, “అమాత్య వర్యా! నీవు నాతండ్రియాజ్ఞను బరిపాలించి నన్నుఁ బట్టాభిషిక్తునిఁ గావించి నాచేత సామ్రాజ్య మేలింపఁజేసితివి. నీయనుగ్రహమున నే నిట్టి సార్వభౌమపదవికి వచ్చి జన్మసార్ధక్యమును గాంచితిని. నాతండ్రియాజ్ఞ యెట్లు పరిపాలించితివో అట్లే నాయాజ్ఞనుగూడ నీవు పరిపాలింపవలసిన కాల మాసన్నమైనది. నామరణానంతరము నాకుమారుఁడైన తిరుమలదేవ