ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iv

చేతను వానిని విడిచిపెట్టినాఁడను, ఈ తిమ్మరుసు జీవితమును జదువువారు కృష్ణరాయనికింగల గౌరవమునంతయుఁ దిమ్మరుసునకు ముడిబెట్టితి నని దురభిప్రాయము పడవచ్చును. కాని నేను వ్రాసినదానిలో నతిశయోక్తులంతగా లేదని చెప్పఁగలను. కృష్ణదేవరాయనికిఁ గలిగినకీర్తి కంతకు మూలము తిమ్మరుసని యీగ్రంథముఁ జదివినవారికి బోధపడఁగలదు. తిమ్మరుసు ప్రతిభను పేర్కొనుట రాయని ప్రతిభకు భంగము కలిగించుట కాఁ జాలదు. తిమ్మరుసునకు లేని యాధిక్యముమ నేను గల్పించినవాఁడను గాను. శ్రీకృష్ణ దేవరాయనికి సమకాలికుఁడైన డామంగో పేయస్సను పోర్చుగీసు చరిత్రకారుఁడు తిమ్మరుసును గూర్చి యిట్లు దెలిపియున్నాఁడు.

"Salvatinica, who is the principal person that enters the building, supervises the whole, for he brought up the king and made him the king, and so the king looks on him like father. Whenever the king calls to him he addresses him as “Lord (senhor) Salvatinica" and all the captains and nobles of the realm make salam to him.

తిమ్మరుసును శిక్షించుకాలమునందు సయితము కృష్ణదేవరాయలీ క్రింద వాక్యమును తిమ్మరుసు నుద్దేశించి పలికినట్లు సమకాలికుఁ డైన సన్నీజను పోర్చుగీసు చరిత్రకారుఁడు వ్రాసియున్నాఁడు.

"I held thee always as my great friend, and now for these forty years thou hast been governor in this kingdom, which thou gavest me."

ఈ గ్రంథమునందు తిమ్మరుసునకు రాజనీతి విద్యోపదేశకుఁడు నాదిండ్ల చిట్టిగంగనామాత్యుఁడని నేను వ్రాసినది పరంపరగా దేశములో వాఁడుకొనెడి కథలను బట్టిగాని మఱి యన్యము కాదు. నాదిండ్ల చిట్టి