ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థ ప్రకరణము

45


నిడుటకు గారణమైనది. ఇట్టి కార్యనిర్వాహకత్వమున నరసింహభూపాలవర్యుఁడు తిమ్మరుసుమంత్రినిగాక మఱియెవ్వనినైన నియోగించి యుండెనేని సామ్రాజ్యమునే కోల్పోయి యుండును. ఇట్టి యాధిపత్యమును వహించి తిమ్మరుసు తనప్రజ్ఞా విశేషముచేత నంతఃపురమందిరమున మహోపద్రవము లేవియు సంభవింపకుండఁ గాపాడుకొనుచు వచ్చెను. ఏ మంత్రి యెట్టి బుద్ధి కలవాఁడో, ఏ సేనాధిపతి యెట్టి స్వభావము కలవాఁడో, ఏ మాండలిక ప్రతినిధి యెట్టి నైసర్గికగుణము కలవాడో, ఏ సామంతనృపతి యెట్టితలంపు గలవాఁడో సామ్రాజ్యమున నెల్ల వారి గుణశీలవృత్తములను దెలిసినవాఁడు తిమ్మరుసు మంత్రి. మఱియు రాజంతఃపుర మందిరమున సేవకావృత్తి నున్న దాసదాసీ జనంబుల గుణశీలవృత్తములఁ జక్కగా గ్రహించినవాఁడు తిమ్మరుసుమంత్రి. ఇంతియగాక యంతఃపుర మందిరముల నివసించు రాజబంధువు లందఱు నెట్టివారో యీతఁ డెఱుంగును. ఈ మహాపురుషుఁడు చేయుకార్యములకు సామ్రాజ్యాధిపతి యెన్నఁడు నడ్డము రాఁడని యెల్లవారు నెఱుంగుదురు. అందుచే మహాధికారియైననేమి, సామాన్యాధికారి యైననేమి, మహారాజైననేమి, మహారాజబంధువుఁడైన నేమి, అధికారియైన నేమి, అనధికారి యైననేమి, పట్టపురాణియైన నేమి, దాసీయువతి యైన నేమి, తిమ్మరుసాజ్ఞ యన గడగడలాడుచు విధేయులై వర్తించు చుండిరి. అంతఃపుర మందిరములలో నెంతరహస్యముగా నెట్టికార్యము జరిగినను తిమ్మ -