ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థప్రకరణము

రాజకుటుంబ రక్షణభారము

ఇక్ష్వాకువంశవార్షిచంద్రుఁ డగు దశరధమహారాజునకు కౌసల్యా సుమిత్రా కైకేయీలవలెఁ దుళువ నరసింహరాయనికి 'తిప్పాంబ, నాగాంబ, ఓబాంబ' లను మూవురు భార్య లుండిరి. నరసింహరాయనికి తిప్పాంబయందు వీరనరసింహదేవరాయఁడును, నాగాంబయందు కృష్ణదేవరాయఁడును, ఓబాంబికయందు అచ్చుతదేవరాయఁడును, రంగరాయఁడునను కుమారులు నల్వురు జనించిరి. ఎట్లుసామ్రాజ్య భారమునంతయుఁ దిమ్మరుసుమంత్రిపై నుంచి ప్రవర్తించెనో, అట్లే నరసింహదేవరాయఁడు స్వకుటుంబరక్షణ భారమును గూడ నాతనిపై నే యుంచెను. సామ్రాజ్యసంరక్షణభార మెంతకష్టప్రద మైనదో రాజకుటుంబసంరక్షణభార మంత కష్టప్రదమైనది. ముగ్గురు భార్యలను గట్టుకొని దశరథుఁ డెట్లు బాధపడియెనో యట్లే సరసింహదేవరాయఁడును ముగ్గురు భార్యలను గట్టుకొని బాధ పడుచుండెను. ప్రణయినుల ప్రణయకోపము మూలమున సంభవించెడి కలహములను నివర్తింపజేయు సందర్భమున నరసింహదేవరాయనికి హితవిధానములఁ గఱపవలసినవాఁడు తిమ్మరుసు గాక సమర్థుఁడగు మంత్రి మఱియొకఁడు లేఁడు. ఇట్లగుట దుర్భరమైన రాజకుటుంబరక్షణభారము బ్రాహ్మణమంత్రిపై