ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(7)

తృతీయ ప్రకరణము

39


చున్న తుళువనరసింగరాయఁడు తనకు వశ్యుఁడై కర్ణాట సామ్రాజ్యనిర్వహణభారము నంతయుఁ దనపై బెట్టినందున సాళువతిమ్మనామాత్యచూడామణి యా మహాసామ్రాజ్యతంత్రమును బ్రజానురంజకముగ నడుపుచు, సుస్థిరముగ నిలుచుమార్గము నాలోచింపు చుండెను. అదివఱకు హైందవసామ్రాజ్యమునకు ప్రతిస్పర్ధముగ వర్థిల్లుచున్న బహమనీ సామ్రాజ్యము స్వప్రయోజనపరులైన సుబాదారులకుఁ జిక్కి యన్యోన్య వైషమ్యములమూలమున నైదువిభాగములుగా విడిపోయెను. (1) బరీద్‌షాహి, ఇది కాసింబరీద్ అనువానిచే నేర్పడియెను. దీని రాజధాని బేదర్ లేక బెడందకోట. (2) ఇమాంషాహి. ఇది పరాడ్ దేశములోనిది. ఫత్తేఉల్లా ఇమాంషాహ అను వానిచే నేర్పడియెను. దీని రాజధాని గావిల్ ‌గడము. (3) నిజాం షాహి ఇది అహమ్మద్‌షాహ అనువానిచే నేర్పడియెను. దీని రాజధాని అహమ్మదునగరము. (4) ఆదిల్‌షాహి ఇది యూసుఫ్‌ఆదిల్ షాహు అనువానిచే నేర్పడియెను. దీనిరాజధాని విజాపురము. (5) కుత్బ్‌షాహి. ఇది కూలికుత్బుషాహ అను వానిచే నేర్పడియెను. దీని రాజధాని గోలకొండ.[1] బహమనీ రాజ్యమిట్లు విభాగమై బలహీనమగుటకూడ తిమ్మరుసు చేయు ప్రయత్నములకుఁ దోడ్పడి జయప్రదములగుట కవకాశమిచ్చు

  1. ఈ గోలకొండ రాజ్యము బహమనీరాజ్యమునుండి క్రీ. శ. 1512 సంవత్సరమున విడిపోయెను. తక్కిన వన్నియు క్రీ. శ. 1482 లోపలనే స్వతంత్రమును బ్రకటించి పరిపాలింపబడు చుండినవి.