ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(4)

ప్రథమ ప్రకరణము

15


అప్పుడు తిమ్మనార్యుఁడు 'అమాత్యవర్యా! నీ యభీష్టమును దీర్చుటకన్నఁ బరమోత్కృష్టమైన కార్యము నాకుమఱి యొండులేదు. అవశ్యము హైంధవసామ్రాజ్యాభి వర్ధనమునకై నాజీవితమును ధారపోయుదును. కృష్ణానదికి దక్షిణభాగము నుండి యశ్వపతులను గజపతులను బాఱద్రోఁలి మఱియెప్పుడును నడుగుపెట్టకుండఁజేయుదు. మహాత్మా! నీకుందెలిసిన రాజనీతిని నాకుబోధించి నాజన్మము. కృతార్థతంబొరయునట్లు గావించి యాశీర్వదింపుము. నీకరుణాప్రసాదమున సమస్త హైందవాళియొక్క మన్ననకుఁ బాత్రుఁడనై యార్యధర్మరక్షణార్థమై నాజీవితమును ధారపోసి వాసికెక్కుదు' నని పలికెను. ఆపలుకుల కావృద్ధమంత్రి పరమానందమునుబొంది యానాఁడు మొదలుకొని రాజనీతిబోధకంబులగు నర్థశాస్త్రీయ రహస్యంబుల బోధింపుచు వచ్చెను. రెండు సంవత్సరముల కాలములో దండనీతియను గొప్పశాస్త్రములోని మహద్విషయముల నన్నిటిని బోధించెను.

అర్థశాస్త్రపఠనము.

మనువు, బాహుదంతుఁడు, బృహస్పతి, శుక్రుఁడు వ్రాసిన మహద్విషయములను బోధించెను. భరద్వాజుఁడు, పరాశరుఁడు, వ్యాసుఁడు, వైశంపాయనుఁడు, ఘోటముఖుఁడు, పిశునుఁడు, కౌణపదంతుఁడు, వాతవ్యాధి, కాత్యాయనుఁడు,