ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(3)

ప్రథమ ప్రకరణము

7


పురుషుఁడు విద్యాధనములరెంటిని సముపార్జించవలయును. కాలముయొక్క విలువను గుర్తెఱింగి వర్తించినఁ గాని యవి సంప్రాప్తములు గావు. ఇంతకుఁ బూర్వమువలె నాఁటపాటలతోఁ గాలము గడిపిన, నాజన్మము వ్యర్ధము కాఁగలదు. ఇఁక నేనొకక్షణమైనను వ్యర్ధముగాఁ బోఁగొట్టుకొనఁ జాలను, చెడి బంధువులయిండ్లకుఁ జేరుటకంటె విద్యాభ్యాసముఁ జేయునంతవఱకు మాధుకరవృత్తిచే జీవింపుచుఁ గాలముగడుపుటయ యుత్తమపద్దతి. దాన దోషమేమియును గానుపింపదు. సిద్ధుని పలుకులు యధార్థము లనిపించుటకైనను నేను మనఃపూర్వకముగాఁ బరిశ్రమచేసి కృతార్థుఁడ నగుదు. నాకు మహైశ్వర్యము లభించిన నాజన్మము బహుజనోపకారకరమై శాశ్వతమైన యశస్సును పొందును” ఇట్లు తలపోసికొనుచుండ నాబాలునకు నిదురపట్టెను.

దారిద్ర్యము.

తల్లిదండ్రులు బాల్యముననే పరలోకగతులై , చిన్నవారగుటచేత నీబాలురిరువురు దారిద్ర్యమను పెనుభూతము నెదుర్కొనవలసినవారైరి. అష్టకష్టములపాల్సేసి మనస్సు కలంచివైచునది దారిద్ర్యము. గుండెదిటవు లేనివారిని పలాయితులను గావించి దుఃఖపరంపరలఁ బొరలాడించునది దారిద్ర్యము. మృత్యువుకంటెను కష్టప్రదమైనది దారిద్ర్యము. దారిద్ర్యము తలకెక్కినా పోటుబంటులు పిరికిబంటు లగుదురు. సత్యవంతు