ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమప్రకరణము

141


నిర్వురు పుత్త్రులున్నట్టు మనకు స్పష్టమగుచున్నది. కాని తిమ్మరుసుగాని కుమారుఁడు గోవిందరాజుగాని రాయనికుమారుని విషప్రయోగము గావించి చంపుటకుఁ దగుకారణము గానరాదు.

గోవిందరాజు సేనాధిపత్యమొసంగి తన్నాదరించి గౌరవించి గొప్పపదవికిఁ గొనివచ్చిన ప్రభువునెడ విశ్వాసములేక ప్రభుపుత్రునకు విషప్రయోగము చేసెననుమాట యెంత విశ్వాసపాత్రమో దురూహ్యమైనవిషయము. తిమ్మరుసునకు విరోధులగువారు వీరిపై నీదోషమారోపించి యుండవచ్చును, ఈకథయె నిజమైన యెడల తిమ్మరుసు శత్రువులకు, తిమ్మరుసు నెడఁ గలుగుపగఁ దీర్చుకొనుటకు మంచియవకాశము గలిగినది. 1525 మొదలుకొని 1530 వఱకును రాజకుటుంబములో సంభవించిన కలహముల మూలమున సామ్రాజ్యమున విప్లవములు పుట్టి యెట్టెట్టిదుర్ఘటనలను జనింపఁజేసియుండెనో వాని వివరములను దెలిసికొన్నయెడల మన మిందలి సత్యాసత్యములను దెలిసికొనఁగలుగుదుము. తిమ్మరుసుగాని వాని కుమారుఁడు గాని కృష్ణరాయని కుమారునికి విషముపెట్టించి చంపించుటకుఁ గారణమేమై యుండును? రాయల యనంతరము రాజ్యము రాయని వంశమువారికి గాక వాని ప్రతిపక్షమువారికి సంక్రమింపఁ జేయవలయుననిగదా యట్టి దుర్మార్గమున కొడిగట్టుట సంభవించును ? ఎవరా ప్రతిపక్షమువారు ? వాని సోదరులయిన