ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

తిమ్మరుసు మంత్రి


రుగ నుండెను. ఒక్కొక్క భటునకు నెలకు ముప్పది పణముల జీత మీయఁబడుచుండెను. వీరికగు ఖర్చుమొత్తమునంతయు జారస్త్రీలపై విధింపఁబడిన పన్నులనుండి గైకొని వ్యయపెట్టు చుండిరి. అమ్మహానగరమున సప్తప్రాకారములమధ్య నెచ్చోట బందిపోట్లుగాని, దోపిడిలుగాని, ప్రమాదములుగాని, దొంగతనములుగాని, హత్యలుగాని, మఱి యేవిధములయిన యల్లరులుగాని జరుగకుండ జూచు బాధ్యతయును, సాలీనావృత్తాంతమును దప్పక సామ్రాజ్యాధిపతికిఁ బంపుచుండు బాధ్యతయును వహించి నగరాధ్యక్షుఁడు నగరమును బహుజాగరూకతతోఁ బరిపాలించుచుండును. అందువలన నేరములు బహుస్వల్పముగ జరుగుచుండెను. ఇప్పటివలెగాక యాకాలమందు దొంగతనము మొదలగు నేరములకు బహుక్రూరములగు శిక్షలు విధింపఁ బడుచుండుటయుఁగూడ నాకాలమున దొంగతనములు స్వల్పముగ నుండుటకు ముఖ్యకారణమని తలంపవచ్చును. దొంగతనము వృతిగఁజేసికొని బ్రదుకునట్టివాఁడు పట్టుబడినప్పుడు తప్పక కాలో చేయో పోఁగొట్టుకోవలసిన వాఁడగును. ఆకాలమున నేరములకు శిక్షలు మాత్రము బహుక్రూరములుగానే యుండెడివని చెప్పవచ్చును. దొంగతనము పెద్దదిగానున్న యెడల మరణశిక్ష యనగా గొడ్డలితో తల నఱుకఁబడుటయే తటస్థించును. అవివాహితలైన కన్యలనుగాని, వివాహితలయిన సాధ్వీమణులనుగాని చెఱచినవానికి మరణదండన విధించుచుండిరి. సామంతుఁడైనవాఁడు రాజుపైఁ దిరుగఁబడి యుద్ధముచేయు