ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

తిమ్మరుసు మంత్రి


వాఁడు, గురుశుశ్రూష చేయనివాఁడు. అనృతవాది, చంపనుద్యుకుఁడు, తప్పుచేసియు అలుకనివాఁడు, పరదేశాగతుఁడు, అధర్మపరుఁడు, అగువానిని చేర్పకుము.” (అదేవ్యాఖ్య.)

"తే. బాహుజాంఘ్రిజముఖి విడంబనకు నయిన
    గొలిచి మనువిప్రధర్మంబు దెలిసియైనఁ
    బూని సంకటముల నిల్చుఁగానఁ దఱచు
    బ్రాహ్మణునిఁ బ్రభుఁజేయుట పతికి హితము."
                                  (ప. 217)

“రాజు బ్రాహ్మణుని గొప్ప యధికారమునందు నియమించుకొనుటచేత మేలొందును; ఏలయన బ్రాహ్మణుఁడు తాను సంకటములలో నిలువక తప్పినచో తన్ను క్షత్రియ శూద్రాదులు పరిహసింతురనియు, తనవలె రాజులకడదొరలై సేవించు నితరబ్రాహ్మణుల వర్తనము జూచి దాని నవలంబించియు, సంకటములయందు పూనికతో నిలిచి వానిని తొలగించును. (అదేవ్యాఖ్య.)"

ఈపై భావప్రకటనము శ్రీకృష్ణదేవరాయనికి తిమ్మరుసు మంత్రియొక్క ఋజువర్తనమును బరీక్షించుటవలననే కలిగినదని మనము తలుపవచ్చును. ఇట్టి విశ్వాసము కృష్ణరాయని కుండుటచే సమర్థులయిన బ్రాహ్మణులాకాలమున నుత్తమాధికార పదవులనుగూడఁ బడయుటగూడ దటస్థింపుచు వచ్చెను. తిమ్మరుసు రాజ్యపాలనము వహించినది మొదలుకొని మహాసేనాధిపత్యములు, మండలాధిపత్యములు, తెలఁగువారికే