ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

తిమ్మరుసు మంత్రి


లతో భోజనముపెట్టి, మనుగుడుపుపెండ్లికొడుకుల మనుపునట్లు మనుపు చుండును లే" యని యెగతాళిగఁ బలికెను. ఇంకొక బాలుఁడు వచ్చి 'మఱే లే మనతిమ్మన్న కప్పుడు మనమాట జ్ఞప్తియుండునా? అతఁ డెవ్వరో మన మెవ్వరమో?' అని నిష్ఠురోక్తులు పలికెను. 'మిత్రులారా ! దరిద్రునికిఁ గోరికలు మెండని పెద్దలు చెప్పినవిధముగా మనతిమ్మన్నకుఁ బెద్దకోరికలే పొడమినవి. వా రేమి వెఱ్ఱివారలా? అని వేఱొక బాలుఁడు వచిం చెను. ఇట్లీవిధముగా బాలు రెల్లరు నెవ్వారికిఁదోఁచిన పోటు మాటలను వారు పలికి మనస్సు నొప్పించిరి. అతఁడు సూక్ష్మబుద్ధి కలవాఁడు గావున వారి యెగతాళిపలుకుల కుడుకుఁ జెందక వారలయెదుటఁదమ్మునకు సిద్ధునిపలుకులు వినిపించుట తప్పని గ్రహించి వారలతో నవ్వుచునాటల నాడుచుఁ బాటలఁ బాడుచు నాఁటిదినము సంతోషముతో గాలము పుచ్చెను. అతఁ డానాఁటిరాత్రి పండుకొనియున్నవేళ సిద్ధునిసుద్దులు మరల దలఁపునకు రాఁగా నిద్దురపట్టక తనలోఁ దానిట్లు తలపోసికొనియెను.

“ఎవ్వడీప్రపంచములో బహుజనోపకారియై ప్రవర్తింపుచుఁ దనజన్మమును సార్థకపఱచుకొనునో వాఁడే పురుషుఁడు; వానిదే యుత్తమజన్మము. వానికీర్తి శాశ్వత బ్రహ్మకల్పముగా భూమిపై నిలుచును. విద్యయు ధనము నున్నగాని జన్మము సార్థకతఁ గాంచదు. బహుజనోపకారి కావలెనన్న నవశ్యము