ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమ ప్రకరణము.

తిమ్మరుసు పరిపాలనము.

ఏనాఁడు సాళువనరసింహధరాతలేంద్రుడుఁ విజయనగరమునఁ బట్టాభిషిక్తుడయ్యెనో ఆనాఁడు మొదలుకొని నలువది సంవత్సరముల కాలమును తిమ్మరుసు విజయనగరంబునఁ గడపెను. సమకాలికులలో నాతనితో సమానుఁడగు ప్రతిభాశాలి దక్షిణహిందూస్థానమునఁ గానరాఁడు. దక్షిణహిందూస్థానమునమాత్రమేగాదు, భరతఖండమునఁ గూఁడఁ గానరాఁడని చెప్పవచ్చును. కరాటసామ్రాజ్య మనియెడు నీహైందవసామ్రాజ్యముయొక్క కీర్తి ఖండాంతరములఁ గూఁడ వెలయునట్లు చేసెను. రాజకుటుంబములలో జన్మించినకలహములనడంచి, అసమర్థులను వెనుకకు నెట్టి సమర్థులను ముందుకుఁ గొనివచ్చెను. తన కాలమునఁ దనకోరిక ననుసరించి నల్వురను పట్టభద్రులను గావింపవలసివచ్చినను రాజధానీ నగరమున నెట్టి విప్లవమును జనింపకుండఁచేసి నగరమును గాపాడిన మహానీయుని కాలమున నెంతయభివృద్ధి కలిగినదన్నను వింతయేముండును ? బలాడ్యుడయిన శత్రురాజులను జయించి రాజ్యము విస్తరింపఁజేసెను. సామ్రాజ్యమధ్యమున జనించిన రాజద్రోహకరములయిన కార్యముల నన్నిఁటిని సడంచివై చెను. సామ్రాజ్యమునకు తోడుపడిన సామంతరాజును కప్పములు సరిగాఁ జెల్లించినట్లు కట్టుదిట్టము