ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమప్రకరణము

125


కుతుబ్‌షాహ సేనానియగు మదార్‌మల్‌ఖానుని భార్యాసమేతముగాఁ జెఱగొని వాని ధనకనక వస్తువాహనాదులఁ జూఱఁగొని విజయనగరమునకుఁ బంపివేసెను. ఈ సేనాధిపతియైన తురుష్కు డామరణాంతమును జెఱయందే యుంచఁబడెను. ఇట్లు తిమ్మరుసు తురుష్కులను దేశమునుండి పాఱఁద్రోలి కొండవీటి రాజ్యపరిపాలనమును జక్కపఱచుటకు సమకట్టెను.

తిమ్మర్సు మేనల్లుఁడు

తిమ్మరుసు కొండవీడును గజపతులనుండి స్వాధీనపఱచు కొన్నపిమ్మటను నాదిండ్ల అప్పామాత్యుని కొండవీటిరాజ్యమునకుఁ బరిపాలకునిగా నియమించెనని యిదివఱకు చెప్సియున్నాఁడను. తిమ్మరుసు తనతోఁబుట్టువగు కృష్ణాంబికను నాదిండ్ల తిమ్మామాత్యున కిచ్చెనని ప్రథమప్రకరణమునఁ దెలిపియున్నాఁడను. ఆదంపతులకు మూవురు పుత్త్రులు గలరు. వారిలో అప్పనమంత్రి రెండవవాడు. గోపనమంత్రి మూడవ వాఁడు. పెద్దవాఁడైన కోనయమంత్రిని గుఱించి మన కేమియును దెలియదు. కృష్ణరాయఁడు పూర్వదిగ్విజయ యాత్రకు వెడలునప్పుడు గుత్తిదుర్గాధ్యక్షుడుగా నున్న తనతమ్ముని గోవిందరాజదండనాథుని విజయనగరాధ్యక్షునిగ నియమించి తిమ్మ