ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్ఠమప్రకరణము

121


పాత్రసామంతుల మోసపుచ్చుట

మనకిట్టి విపత్తు కలుగవచ్చునని నేనూహించినవాఁడ నగుటచేతనే బెజవాడలో నాఁడు యుద్ధము చాలించి వెనుకకు మరలుదమని చెప్పితిని. అయిననేమి? దీనికై చింతింపకుము. ఉపాయముచేత యుద్ధమును మాన్పించి తనకూఁతు నీకిచ్చి వివాహముచేసి గజపతి నీతోడ సంధి చేసికొనునట్లు గావించి నిన్నీ పరిభవమునుండి గాపాడుదును. చూడుము నాశక్తియని పలికి యాతనిఁ బంపివేసి యిట్లు చింతించెను.

మనష్యుఁడైనవాఁడు తనకార్యమును నెరవేర్చుకొనుటకు సామదాన భేదదండములను జతుర్విధోపాయములఁ బ్రయోగింపవలసి యుండును. ఇచ్చట నామము పనికిరాదు. దండము సాధ్యమగునది గాదు. దానము భేదము నను రెంటివలనను కార్యము సాధింపవచ్చును. పాత్రసామంతులకును వారి ప్రభువునకును భేదము పుట్టించినఁగాని స్వపక్షమునకు జయము సమకూరునట్లు గన్పటదు. వంచనచేసి తప్పించుకొనుట కూడదని శత్రువునకుఁ దలయొగ్గి నాశనము నొందఁ గోరునంతటి యవివేకిఁ లోకిములో నెవ్వడుండును? ఇంతప్రఖ్యాతిఁ గాంచిన నాప్రభువునకు నవమానము గలుగుచుండ నుపేక్షించి యూరకుండుట భృత్యధర్మముగాదు. ఇట్టి సందర్భమునఁ జేసిన వంచన రాజనీతికి విరుద్ధముగాదు. అని వితర్కించుకొని తిమ్మరుసుమంత్రి పదియార్వురు పాత్రసామంతులపేరను దురాశను