ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

తిమ్మరుసు మంత్రి


విజయనగర సంస్థానాధీశ్వరు లీరాచిరాజు వంశములోని వారని చెప్పఁదగును.[1]

కొండవీడును ముట్టడించుట

తిమ్మరుసుమంత్రి క్రీ.శ. 1515_వ సంవత్సరము మార్చినెలలో కొండవీటిదుర్గమును ముట్టడించెను. ప్రతాపరుద్రగజపతి కొండవీటిముట్టడిని విడిపించుటకై వేయిమున్నూఱు గజబలముతోడను, ఇరువదివేల గుఱ్ఱపుదళముతోడను, అయిదులక్షలకాల్బలముతోడను వచ్చుచున్నాఁడని తిమ్మరుసు విని తాను కొండవీడును ముట్టడించి స్వాధీనముఁ జేసికొందుననియు, ప్రతాపరుద్రగజపతిని కృష్ణరాయం డెదుర్కొని తఱిమి

  1. పూసపాటి తమ్మరాజకృతమైన 'శ్రీకృష్ణవిజయ' మను గ్రంథమున నీక్రింది పద్యములోఁ దెలుపఁబడినది.

    సీ. నవభారతాఖ్యాన నవ్యకావ్యమునకు
                నాయకుం డయ్యె నేనరవరుండు
        కటకేశ్వరునిచేతఁ గని కేతవర మాత్మ
                పురముగా నేలె నేభూవిభుండు
        నిలిపె భారుహమన్నె నృపగండ పెండేర
                మెపుడు డాకాల నేనృపతిమౌళి
        యఖిలసద్గుణవతి యక్కమాంబాదేవి
                ప్రాణేశుఁడయ్యే నేపార్ధివుండు

        బ్రథితగజపతి రాజవీరప్రతాప
        రుద్రతనయాధినాయ కారూఢతమ్మి
        రాజజనకతఁ గాంచె నేరాజతిలక
        మతఁ డలరు తమ్మ విభురాచయప్రభుండు.