ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

తిమ్మరుసు మంత్రి


మాసములు ముట్టడించి యున్నను స్వాధీనముగానందునఁ బోరుచుండెను. బహువిధముల నష్టపడి తుదకుఁ గొండలను బగులఁ గొట్టించి విశాలములైనబాటల నేర్పఱచుకొని దుర్గమునుసమీపించి యాకలిబాధచేఁ దపింపుచు గుహలలోనుండి సింహములవలె వెలువడి పోరాడుశత్రుభటుల నెదుర్కొని వారల సంహరించి శ్రీకృష్ణదేవరాయఁడు దుర్గమును వశపఱచుకొని తద్దుర్గాధ్యక్షుఁడైన తిరుమలకాంతరాయని జెఱఁ గొనియెను. రాయని విజయంబునకుఁ దిమ్మరుసు సంతోషించి ఉదయగిరి రాజ్యమునకుఁ గొండమరుసయ్య దండనాధుని నేకధురంధరనిగా (గవర్నరు) నియమించెను. అతఁడు దేశమును స్వాధీనపఱుచుకొని న్యాయపరిపాలనమును నెలకొల్పి చక్కని కట్టుబాటులను గావించి విజయనగరముననున్న మూలబలములోని కొంతసైన్యమును తిమ్మరుసు సమ్మతినిగొని రప్పించి యుదయగిరిరాజ్యరక్షణమునకై నిలిపి తానును, రాయలును, తిమ్మరుసును గలిసికొనఁ బోయిరి. ఉదయగిరి మొదలుకొని నరపతి సైన్యములకును గజపతిసైన్యములకును రెండు సంవత్సరముల కాలము ముమ్మరమైన యుద్ధము జరుగుచుండెను. జయము లభించినకొలఁది తిమ్మరుసు సైన్యములు ముందుకు జరుగుచుండ గజపతి సైన్యములు వెనుకకుఁ గ్రమముగాఁ బోవుచుండెను.

ఉదయగిరిదుర్గము, అద్దంకి దుర్గము, వినుకొండదుర్గము,