ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

తిమ్మరుసు మంత్రి


నే నెంతయుఁ గృతజ్ఞుఁడనై యున్నవాఁడను. అసూయాపిశాచగ్రస్తులై స్వార్ధపరాయణులై యూరక నీయెడ దోషారోపణ చేయువారి మాటలను నమ్మి నిన్నపనిందల పాలుచేసి నీతోఁ దగవులాడి కార్యభంగమును గలుగఁ జేసికొనునంతటి యవివేకిని గానని నీవెఱుఁగవా? ఈసామ్రాజ్యము నాకిచ్చినది. నీవ కాదా? నాకిట్టి కీర్తిని గల్పించుచున్నది. నీవకాదా ? వేయు నేల ? పితృవాత్సల్యముతో నా ప్రాణములను బల్మఱుఁ గాపాడినదియు నిప్పటికిని గాపాడుచున్నదియు నీవుగాదా? అట్టి నీకు దుష్టులమాటలు నమ్మి కృతఘ్నుఁడనై యెగ్గొనరింతునా ! ఎంతమాట ! అట్లు స్వప్నమందైనఁ దలంపకుము, మహాత్మా! నీయంతటివాఁడు నాకు ప్రాపై సమస్తరాజ్యనిర్వాహకర్తయై యుండ నేను దిగ్విజయముఁ గావించి లోకమునఁ బ్రశంసాపాత్రుండనగుట యొక యబ్బురమా ! నేటి నీవాక్కు, లానంద దాయకములై ప్రోత్సాహకరములై యొప్పుచున్నవి. అయిన నాకొక్క సందేహము కలుగుచున్నది. ముందు తురుష్కులను జయించి పూర్వదిగ్విజయయాత్రకు బయలువెడలుట యుత్తమ పద్ధతియో లేక పూర్వదిగ్విజయయాత్రను ముగించి తురుష్కులపై దాడి వెడలుట యుత్తమపద్దతియో తెలిసికొనఁజాలక నామనస్సు తల్లడపాటు నొందుచున్నది” అని హెచ్చరించెను. అందులకు మంత్రిపుంగవుం డిట్లు ప్రత్యుత్తర మిచ్చెను.

దేవా! నేఁడు విజాపురసుల్తానుకంటె గజపతి బలవంతుఁడుగ నున్నాఁడు. గజపతిదేశము గొప్పది. అతని సంపద