పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/59

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

    చేయుపనులెల్ల సఫలముల్ చేయుఁగాత
    మలరిరామానుజయ్య వేదాద్రిపతికి.

సీ. ధరణీభరముఁదాల్చు తన చేవయంతయు
               భుజనరిఘంబులఁ బొంకపఱచి
    మునుమిన్కుగనియైన తన ప్రజ్ఞ యంతయు
               మతివిశేషమునందు మస్తరించి
    దై తారివశమైన తన చిత్తమంతయు
               నినుచు గౌరవమున నివ్వటించి
    తనువువెన్నెలగాయు తనమూర్తి యంతయుఁ
               గీర్తివైభవమునఁ గీలుకొలిపి

తే. శేషు డఖిలప్రపంచనిశేషశాలి
     నిత్యముక్తుల కాద్యుఁడై నిలుచుమేటి
     చారుచారిత్రు రామానుజయ్యపుత్రుఁ
     గరణవేదాద్రి మంత్రిశేఖరుని మనుదు.

సీ. తనకులాచారవర్తన వైష్ణవాచార
                పర్యాయముల కొజ్జ బంతిగాఁగఁ
    తనసూనృతము పురాతనసత్యనిధుల యు
                న్నతికిఁ బునః ప్రతిష్ఠితముగాఁగఁ
    దనబుద్ధినీతి శాస్త్రరహస్యములు తెల్ల
                ముగ దెల్పువ్యాఖ్యాన ముద్రగాఁగఁ
    దనవ్రాయుగంటంబు మొనవాడి విశ్వంభ
                రాప్రజలకుఁ బ్రాణరక్షగాఁగఁ

తే. వెలయు మంగయ గురువభూవిభుని పెద్ద
    సంఘభూపాలమణి వ్రాయనప్రవృత్తి