ఈ పుట ఆమోదించబడ్డది

5

తెనుఁగు తేటదనము


తేటతెనుఁగునుగూర్చి కొంచెమంత తెలుపుచున్నాను. ఆంధ్రద్రవిడకర్ణాటభాషలలో తెనుఁగుమాట ప్రసన్నమయినదిగా ఉండుటచేత 'తెనుఁగుతేట' అనియు, 'తేటతెనుఁగు' అనియు, 'తెనుఁగుతేనె' అనియు, దేశభాషలందు తెలుఁగులెస్స' అనియు నానుళ్లు పుట్టినవి. తెనుఁగు కీతేటదనము, లెస్సదనములు సంస్కృతప్రాకృతముల పాళ్లు సమరసముగా కలియుటవల్లను, ద్రవిడకర్ణాటకములకంటె తెలుఁగుమాట మార్దవ, సౌలభ్యములు కల దగుటవల్లను ఏర్పడినవి. ఈ తేటతెలుఁగు చచ్చుడివాని దగ్గఱనుండి జగద్గురువుదాఁక, ఉగ్గుపాలనాఁటినుండి ఉసు రుడుగు దాఁక, బాలశిక్షదగ్గఱ నుండి మోక్షవిద్య దాఁక అన్ని జాతులలో, అన్ని దశలలో, అన్నివిద్యలలో, క్షణక్షణ పరిణామముతో, నవనవవికాసముతో కలకలలాడుచుఁ, దొలఁకులాడుచు నున్నది. హెచ్చుకాలము లిపిరూపము పొంది నిలిచియుండ నక్కఱలేని సంభాషణాదులు, నవ్వుటాలు, తగవును మొదలయిన వాగ్వ్యాపారములను విడిచిపెట్టినప్పటికిని లిపిరూపము పొంది కొన్ని పురుషాంతరములదాఁక ఉండవలసిన వర్తకము, దేశపాలనము, ఆచారవ్యవహారములు, దస్తావేజులు, రాజశాసనములు, దానశాసనములు మొదలయినవానిలోను దేశము, భాష ఉన్నంతకాలము ఉండవలసిన కథలు, కళలు, పాటలు, పదాలు, నాటకములు, నానాశాస్త్రములు, కావ్యములు మొదలయినవానిలోను భాషాప్రవాహము పాయలువాఱి పాఱుచు, మాఱుచు, తేలుచు కావ్యసరస్సులలో నిండార్లుగా నెలకొనుచు నుండును. భాష కున్న ప్రయోజనము లన్నింటిలోను ప్రౌఢకావ్యరచన